సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్.. సిఏఏకు సంబంధించి ఎలాంటి దృష్ప్రచారం ఉంది ? ఎందుకు అసలు ఉద్యమాలు చేస్తున్నారు? ఇలాంటి వాటి గురించి ప్రస్తావిస్తే.. భారత దేశానికి సంబంధించినంతవరుకు ఈ దేశంలోకి వచ్చే పౌరులను ఎవరిని రానియ్యలి.. ఎవరిని రానివ్వకూడదు అనేది ఈ దేశపు హక్కు. దాంట్లో మతాలకు సంబంధించినటువంటి అంశమే కాదు దేశాలకు సంబంధినటువంటి అంశం ఒకటి ఉంటుంది. నేర చరిత్రకు సంబంధించిన అంశం ఒకటి ఉంటుంది. దుర్మార్గాలకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంటుంది. 

 

ఇతర దేశాల్లో అణచివేతకు గురై.. మతపరమైనటువంటి అణచివేతకు గురైనటువంటి హిందులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు , క్రిస్టియన్లు అది కూడా ఇస్లామిక్ రాజ్యాలు అయినా అఫంగనిస్తాన్, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి వాటిలో మాత్రమే తీవ్రమైన అణచివేతకు గురయ్యారు. దుబాయ్ లోను, సౌదీ అరేబియా లాంటి చోట్ల అసలు ఆ ప్రసక్తి లేదు. ఉపాధి పొందుతున్నాం. తింటున్నాం. వచ్చేస్థున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు మాతం మారితేనే ఉంటావ్.. మతం మారకపోతే గనుక ఆస్తులు లాక్కుంటాం.. బిడ్డలను లాక్కుంటాం.. ప్రాణాలు తీస్తాం అంటూ బెదిరించేవాటికి ప్రభుత్వాలు, అక్కడ ఉన్న కోర్టులు మద్దతు ఇవ్వడం. మొన్న పాకిస్థాన్ ఎలాంటి తీర్పులు ఇచ్చిందో కూడా చూశాం..

 

అందుకోసమే సీఏఏ లాంటివి వచ్చాయి. అయితే ఇది రావడం పట్ల దీనిపై దృష్ప్రచారం ఏం చేశారు అంటే.. ఈ దేశంలో ముస్లింలను తరిమేస్తున్నారు అంటూ దృష్ప్రచారం చేస్తుంటే.. ఎందుకు వచ్చిన గొడవ మనకు ఇది.. మనకు వారి ఓట్లు కావాలి కదా అని.. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా అటువైపుకే సపోర్ట్ చేస్తూన్న సమయంలో.. బీజేపీ ఎంత చెప్పిన మీడియాలో ఉన్నటువంటి మెజారిటీ సెక్షన్ ఎగైనెస్ట్ గానే ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ దీనికి ఒక వరం అయ్యారు. 

 

మంచి ఎక్సప్లనేషన్ తో.. ప్రజలలోకి మంచి చెప్తూ తీసుకువెళ్తున్నారు.. కర్నూల్ లో కూడా అలానే మంచిగా చెప్పారు.. మొన్న జరిగిన కుర్నూల్ లో ఇలా సీఏఏ గురించి మంచి చెప్పుకుంటూ వెళ్లారు.. అయితే పవన్ కళ్యాణ్ ఏవి అయితే చెప్పుకుంటూ వచ్చారో అదే అంశాన్ని కన్నబాబు కానీ జివిఎల్ నరసింహారావు గారు కానీ చెప్తే అది వెటకారం చేస్తూ వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ చాల పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకొని చెప్పారు. ఇలా చెప్పడం అనేది బీజేపీకి కూడా ఒక వరం అనే చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పడం ఒక వరం. పవన్ కళ్యాణ్ ఎంతో చక్కగా ఆ అంశాన్ని చాల అద్భుతంగా చెప్పారు అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకు వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: