దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఇటీవల నేర చరితులు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయడం పై దాఖలైన పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థుల పై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను మొత్తం ప్రచారంలోకి తీసుకు రావాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ లో మరియు సోషల్ మీడియాలో పార్టీ అభ్యర్థుల కేసుల వివరాలను అధికారికంగా పెట్టాలని స్పష్టం చేసింది. గతంలోనే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది కానీ..అమలులోకి రాలేదు. దీంతో ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల వివరాలను అఫిడవిట్ లో సమర్పించిన సమయంలో చాలా మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు వివరాలు ఎలక్షన్ కమిషన్ కి తెలుపలేదని సుప్రీం దృష్టికి వచ్చినట్లు సమాచారం.

 

దీంతో ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో ఉన్న వారిని ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు క్రికెట్ ఎలా ఇస్తున్నారు అన్ని వివరాలు రాజకీయ పార్టీలు బయటపెట్టాలని తాజాగా సుప్రీం స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న అభ్యర్థిని క్యాండెట్ గా ఎలా ఎంపిక చేస్తారని రాజకీయ పార్టీలను సుప్రీమ్ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో నేర చరితుల రాజకీయ నాయకుల హవా పెరిగిపోతుంది అత్యున్నత ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

 

దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేరగాళ్లను ఎన్నికలలో పోటీ చేయకుండా చర్యలు తీసుకోండి అని అంటున్న సుప్రీం ఎన్నికల సమయంలో డబ్బు పంచడం మద్యాన్ని కూడా అరికట్టాలని సామాన్యులు సుప్రీంకోర్టు ని ప్రశ్నిస్తున్నారు. ఓటర్ ని ప్రభావితం చేసే డబ్బు మద్యాన్ని ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా అమ్మకుండా పంచకుండా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: