కొద్ది రోజులుగా ఏపీ లో జరుగుతున్న ఐటీ దాడులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న దాడులలో కోట్లాది రూపాయల సొమ్ము లకు సంబంధించి ఆధారాలు బయటపడుతూ ఉండడంతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు, అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇలా ఎన్నెన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిపై దాడులు జరగడం, సుమారు 150 కోట్లు అక్రమాస్తులతో పాటు ఆయన ఇంట్లో దొరికిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, లాకర్లలో టీడీపీ అగ్రనేతల అవినీతి ఆధారాలు ఎన్నో ఐటీ శాఖ సంపాదించింది. అక్కడ దొరికినా ఆధారాల ప్రకారం ఐటీ శాఖ మొత్తం కూపీ లాగుతోంది. ఇంత జరుగుతున్నా ఆ పార్టీ అగ్ర నాయకులూ ఇప్పటివరకు నోరు మెదపలేదు.


 దీంతో టిడిపి ఆందోళన ఉందని, మరి కొన్ని ఆధారాలు బయట పడిపోతున్నాయని అంతా భావించారు. అలాగే ఓ ఇన్ఫ్రా  కంపెనీ లో దొరికిన అవినీతి ఆధారాలను బట్టి సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ప్రచారం జరిగింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించి కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటూ కామెంట్ చేశారు. కేవలం 45 చోట్ల ఐటి సోదాలు నిర్వహించి కేవలం స్వల్ప మొత్తంలో సొమ్ము పట్టుకుంది అంటూ  ట్విట్టర్ వేదికగా లోకేష్ స్పందించారు. 

 

అంటే లోకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అవినీతి ఇంకా పెద్ద మొత్తంలో జరిగిందని, ప్రస్తుతం దొరికిన రెండు వేల కోట్లు మొత్తం చాలా చిన్న అమౌంట్ అన్నట్లుగా ఆయన ట్విట్టర్ లో పేర్కొనడాన్ని కొందరు ఇప్పుడు విశ్లేషిస్తూ టిడిపి కౌంటర్ వేస్తున్నారు. ఇంకా లక్షల కోట్లు అవినీతి జరిగి ఉండవచ్చని, వాటి గురించి బయట పడలేదని లోకేష్ భావించి ఉండవచ్చని, అందుకే రెండు వేల కోట్లేనా అంటూ లోకేష్ తేలిగ్గా కొట్టిపారేస్తున్నాడని సోషల్ మీడియాలో లోకేష్ పై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మిగతా టీడీపీ నాయకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: