ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ స్థాయిలో దూకుడుగా ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. రాజకీయంగా బలంగా ఉన్న ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇటు ప్రజలను అటు సొంత పార్టీ కార్యకర్తలను ఒకానొక దశలో కేంద్రాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నారు అనేది వాస్తవం. తాజాగా ఆయన తీసుకున్న మండలి రద్దు నిర్ణయం ఇప్పటికి దేశంలో హాట్ టాపిక్ గానే ఉంది. ఇంత దూకుడుగా ఒకే రోజు కేబినేట్ నిర్ణయం తీసుకోవడం, అదే రోజు అసెంబ్లీ ఆమోదించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. 

 

ఇక ఇప్పుడు జగన్ మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి మీద పోరాటం చేస్తున్న జగన్ అవినీతి అధికారులకు చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన రెవెన్యూ అధికారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రెవెన్యు శాఖ మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తొలగించాలని భావిస్తున్న జగన్, ఆ శాఖలో కీలక బదిలీలకు కూడా శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. వారిలో కొంత మంది టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని, వారికి ఇంకా అధికారుల మద్దతు పుష్కలంగా ఉందని జగన్ భావిస్తున్నారు. 

 

దీనితో వారిని తప్పించాలని భావిస్తున్నారట. ఇక ఐటి దాడుల విషయంలో కూడా జగన్ ఇప్పుడు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కేంద్రం ఈయన సహకారం కోరుతుంది కాబట్టి, జగన్ ఐటి అధికారులకు సహకరించి టీడీపీ విషయంలో మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీలో కీలక నేతలు చాలా మంది కాంట్రాక్టర్ల గా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వారి వివరాలను జగన్ సర్కార్ కేంద్రానికి అందించింది. ఇక ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవన్ని కూడా కేంద్రం దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్ళారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: