ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గురించి అందరికి తెలిసిన విషయమే. రాజకీయంగా జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె తోడు ఉన్న విధానంతో ఆమెకు వైసీపీలో భారీగా అభిమానులు ఉన్నారు. ఇక నియోజకవర్గంలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా  ఉంది. కార్యకర్తల బలం ఎక్కువగానే ఉన్న మహిళా నేత ఆమె. ఇక దూకుడుగా ఉంటూ ప్రత్యర్ధుల మీద ఆమె చేసే విమర్శలు కూడా చాలా మందిని ఆకట్టుకుంటూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. అంత వరకు బాగానే ఉంది గాని ఇక్కడే ఒక కొత్త చిక్కు వచ్చినట్టు తెలుస్తుంది. 

 

రోజా దూకుడే ఆమెకు శాపంగా మారిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి రోజా మనస్తత్వమే కాస్త దూకుడుగా ఉంటుంది. చాలా మంది జగన్ మెప్పు అంటారు గాని ఆమె సినిమాల్లో ఉన్నప్పుడు అయినా ఆ తర్వాత తెలుగుదేశంలో అయినా ఎక్కడ అయినా సరే రోజా దూకుడు అనేది ఎక్కువే. ఇదే నియోజకవర్గ పార్టీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనే టాక్ వినపడుతుంది. ఇటీవల నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు జగన్ ని కలవడానికి ప్రయత్నాలు చేసారు. 

 

అయితే వారిని రోజా కలవనీయలేదు అనే టాక్ వినపడింది. దీనితో నియోజకవర్గ నేతలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. వాస్తవానికి నియోజకవర్గంలో ఆమెపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందట. జగన్ దగ్గరకు నేరుగా వెళ్ళిపోయే చనువు ఉండటమే కాకుండా పార్టీలో ఆమెకు పెద్ద పీట వేయడంతో నియోజవర్గ స్థాయి నేతలు ఇబ్బందులు పడుతున్నారు. తమ మాట చెల్లుబాటు అవ్వడం లేదనే ఆవేదన వారిలో ఉంది. కార్యకర్తలకు కూడా తాము ఏమీ చేయలేని వారిగా కనపడుతున్నామని వారిలో వారే మధన పడుతున్నారు. అందుకే రోజాకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: