జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకోవడం చూసి ముందు ఆశ్చర్యపోయింది ఆ పార్టీ కార్యకర్తలే. బూత్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి గాను, ముందు వామపక్షాలతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రయాణం చేసారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఎన్నికల తర్వాతా వాళ్ళ అవసరం లేదని అనుకున్నారో ఏమో తెలియదు గాని, వాళ్ళను వదిలేసి బిజెపితో ప్రయత్నాలు చేసి పొత్తు పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో పవన్ చేసిన భజన చూసిన జనసేన కార్యకర్తలు పార్టీని అందులో విలీనం చేసే అవకాశం ఉందని భావించారు.

 

అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు జగన్ షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఎన్డియేలో వైసీపీ చేరే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ పరిశీలకుల మాట. ఎన్డియే తో కలిసి ప్రయాణం చేయడానికి జగన్ సిద్దమమయ్యారని, విజయసాయి రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే పవన్ ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుంది అంటున్నారు పలువురు. జగన్ బిజెపితో స్నేహం చేయడం చూసిన పవన్ కళ్యాణ్ తనకు తేడా వస్తుంది ఏమో అని భయపడుతున్నారు. 

 

వాస్తవానికి జెడి లక్ష్మీనారయణను కేంద్రంలోకి పంపించాలి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. వాస్తవానికి పవన్ ఆ విధంగా ట్రై చేసే జేడీని బయటకు పంపించారని, ఆ తర్వాత ఆయన దేశ భక్తి వ్యాఖ్యలు చేసారని అందరికి అర్ధమైంది. కాని అనూహ్యంగా జగన్ చేసిన రాజకీయం దెబ్బకు జేడీకి పదవి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక చంద్రబాబు వ్యూహాలు కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. చంద్రబాబు చెప్పినట్టు చేసే పవన్... ఈ పరిణామంతో తన బాస్ కి ఏమీ చెప్పలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: