పాలకులంటే ప్రజల బాగోగులు పట్టించుకునే వారు.. నాయకులంటే ప్రజలకోసం, ప్రజల సమస్యల కోసం నియమించుకున్న సేవకులు. ఇది అసలైన రాజకీయానికి అర్ధం.. కానీ నేటి రాజకీయాలన్ని నల్లతోలు కప్పుకున్న తోడేళ్లలా, శవాలను పీక్కుతినే రాబంధుల్లా మారిపోయాయి అనడానికి బయటకు వస్తున్న రాజకీయ అవినీతి నిదర్శనం.. ప్రజలంటే పిచ్చి వారు మేము ఎంత దోచుకున్న మాకే పదవులు కట్టబెడతారు. రెండు మంచి మాటలు చెప్పి వారిని మాయ చేయవచ్చూ అనే వారి ఆలోచనలకు తగ్గట్లే ప్రజలు ఉన్నారు..

 

 

ఇకపోతే ఇప్పుడు ఏపీలో అవినీతి పుట్టను తవ్వగా 2 వేల కోట్ల అవినీతి త్రాచులు బయటకు వచ్చాయి.. ఒక్క పైసా కాదు, రెండు పైసలు కాదు. ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రభుత్వాలకు పన్నులు కడుతుంటే, తేరగా వచ్చిన పదవులను అనుభవిస్తూ, కోట్లకు కోట్లు వెనకేసుకునే నాయకులకు సిగ్గు, శరం ఉండాలని ప్రజలు అనుకుంటున్నారట.. ఇకపోతే ఆదాయపన్ను శాఖ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే...

 

 

ఐటీ అధికారులు, 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించారు. మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై వచ్చిన ఆరోపణలతో..  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో ఏక కాలంలో సోదాలను నిర్వహించింది ఐటీ శాఖ. వీటితో పాటు ఓ కీలక రాజకీయ నేతకు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో అధికారులకు.. కీలక ఆధారాలు, పత్రాలు లభించాయి. ఈ వివరాలన్ని ఐటీ శాఖ తన వెబ్సైట్ లో వెల్లడించింది.

 

 

ఇక ఈ సోదాల్లో అసలు టర్నోవర్ లేని కంపెనీలతో ఈ బోగస్ లావాదేవీలు నిర్వహించారని ఐటీ శాఖ ప్రకటించింది. గతంలోనూ ఐటీ శాఖ.. ఓ ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీపై సోదాలు చేసి.. ఇలానే రూ. రెండు,మూడు వేల కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించామని ప్రకటించింది. అప్పుడు బయటపడిన ఆధారాలకు కొనసాగింపుగా ఇప్పుడు  సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారన్న ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు..

 

 

దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే అవినీతి మరకలు అంటని రాజకీయనాయకులు ఉండరని, ఎవరిని నమ్మి పదవులు కట్టపెట్టిన ప్రజలకు ఒరిగేది ఏం ఉండదని, వారి తరాలకు సరిపడే ఆస్తులు సంపాదించుకోవడానికే నాయకులు ప్రాకులాడుతారు గాని ప్రజల కోసం కాదనే విషయాన్ని ఓటర్లు గ్రహించాలి అని తెలుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: