శాసనమండలి కేంద్రంగా ప్రతిపక్షం రివర్స్ గేరులో నడుస్తోంది. నియమ, నిబంధనలను ఉల్లంఘించైనా సరే తాము అనుకున్నది సాధించుకోవాలని పట్టుదలకు పోతోంది.  ఇందులో భాగంగా శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను బ్లాక్ మెయిల్ చేయటానికి కూడా రెడి అయిపోయింది.  నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాసరే తాను చెప్పింది చేయాల్సిందేనంటూ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ పదే పదే కార్యదర్శికి లేఖలు రాస్తు చాలా చికాకులు పెడుతున్నాడు. దీనికి తోడు టిడిపి ఎంఎల్ఏలు అచ్చెన్నాయుడు అండ్ కో కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగటం విచిత్రంగా ఉంది.

 

రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలను పంపుతున్నట్లు ఛైర్మన్ చేసిన ప్రకటనే ఈ కంపు మొత్తానికి కారణం. తాను చేసిన ప్రకటనే నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న విషయం షరీఫ్ కు బాగా తెలుసు. తెరవెనుక నుండి ఛైర్మన్ తో ప్రకటన చేయించిన చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళకు కూడా తాము నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న విషయం బాగా తెలుసు. ఛైర్మన్ మెతకతనాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై తమ కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

 

ఈ నేపధ్యంలోనే ఛైర్మన్ తో యనమల అండ్ కో సెలక్ట్ కమిటి ఏర్పాటుకు ఛైర్మన్ తో లేఖలు రాయించటం దాన్ని కార్యదర్శి తిప్పి పంపటం జరుగుతోంది. ఇప్పటికి రెండుసార్లు అలా జరిగింది. దాంతో అరెస్టు చేయిస్తామని, కోర్టుకు లాగుతామని, సస్పెండ్ చేయిస్తామంటూ టిడిపి నేతలు కార్యదర్శిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. విచిత్రమేమిటంటే నియమ, నిబంధనల ప్రకారం నడుచుకోమని అధికారపార్టీ చెబుతుంటే అక్రమమైనా  తాము చెప్పిందే వినాలని టిడిపి పట్టు పడుతోంది.

 

ప్రతిపక్షంలో ఉండి కూడా తాము చెప్పినట్లే జరగాలని టిడిపి అనుకోవటమే ఈ అనర్ధం మొత్తానికి కారణం. కేవలం మండలిలో మెజారిటి ఉందన్న ఏకైక కారణంతోనే ప్రతిపక్షం ఇంత కంపు చేస్తోంది. ఈ కంపును భరించలేకే మండలి రద్దుక జగన్ పట్టుబడుతున్నది. దాంతో చంద్రబాబు, యనమల మీద టిడిపిలోనే వ్యతిరేకత వచ్చేస్తోంది.  ఏదేమైనా రాజకీయంగా తేల్చుకోవాల్సిన అంశాల్లోకి  అధికారులకు లాగుతుండటమే టిడిపి చవకబారుతనానికి నిదర్శనంగా నిలిచింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: