ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అతి పెద్ద గ్రహశకలం ఒకటి భూమికి అతి చేరువగా దూసుకుపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోదనా సంస్త ప్రకటించింది. దాదాపు 1,443 అడుగుల వెడల్పు, 3268 అడుగుల పొడవు ఉన్న గ్రహశకలం ఒకటి భూమికి అతి దగ్గర దూసుకుపోనుందని నాసా అంచనా వేసింది.

 

భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కన్నా దాదాపు 15 రెట్లు ఎక్కువ దూరంగా ఈ గ్రహ శకలం దూసుకుపోతోంది. అయితే అంత దూరంగా వెళ్లటం కూడా అరుదైన విషయమే అంటున్న నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కాలం భూమికి ఇంత చేరువగా ఓ గ్రహశకలం రావటం ఇదే మొదటి సారి అంటున్నారు. నాసా చెబుతున్న వివరాల ప్రకారం గ్రహశకలం 2002 చెందిన పి జెడ్ 39 అని తెలుస్తోంది. దీనిని మొదటిసారిగా 2002 ఆగస్టులో గుర్తించారు. దీన్ని కనుగొన్నప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17 మధ్యలో ఈ గ్రమశకలం భూమికి దగ్గరగా పోవచ్చని అంచనా వేశారు.

 

అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్‌ తో ఎటువంటి ముప్పు ఉండబోదని నాసా చెబుతోంది. ఇకపోతే మరికొన్ని గ్రహశకలాలు రెండు రోజుల్లో భూమికి అతి దగ్గరనుండి పోవచ్చని నాసా తెలిపింది. ఈ గ్రహ శకలాల తో కూడా ఎటువంటి ముప్పు ఉండబోదని నాసా భరోసా ఇచ్చింది. 

 

2013లో ఫిబ్రవరి 15వ తేదీన రష్యా లో ఒక గ్రహ శకలం భూమిని ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఒక అణుబాంబు పేలిన దానికంటే 20 నుండి 30 రెట్లు శక్తి విడుదలైందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యుని నుంచి వచ్చే వెలుగు కంటే ఎక్కువ వెలుగు ఆ ప్రాంతాన్ని కమ్మేసిందట. ఆ దాటికి దాదాపు ఏడు వేలకు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. వెయ్యి మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. కొన్ని కిలో మీటర్ల మేర భవనాల అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈసారి భూమికి చేరువగా వెళుతున్న గ్రహశకలాలలతో ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిచెప్పారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: