భూమి మీద రోజు రోజుకీ కాలుష్యం ఎక్కువవుతోంది. వాహనాల నుండి వచ్చే పొగ, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలు, ప్లాస్టిక్ వినాశకాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఈ కాలుష్య ప్రభావం మనుషుల మీద చాలా గట్టిగానే పడుతోంది. ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం దాన్ని పూర్తిగా అరికట్టలేకపోతున్నాం. కాలుష్యానికి మనుషుల ఆరోగ్యమే కాదు ప్రకృతి మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

 

 

ఆ ప్రభావం ఇప్పుడు మరో ఘోరంగా ఉంటుంది. తాగే నీరు, తినే ఆహారం మాత్రమే కాదు నడిచే రోడ్లు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. అవును మీరు వింటున్నది నిజమే.. కాలుష్యం వల్ల రోడ్లు కూడా తమ రంగుని మార్చుకుంటున్నాయి. సాధారణంగా రోడ్లన్నీ నలుపు రంగులో ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని రోడ్లు గులాబీ రంగులోకి మారిపోతున్నాయి. 

 

 

 ఈ సంఘటన థానే పట్టణంలోని డోంబివ్లీ ఎంఐడీసీ ఫేజ్ 1లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతం చుట్టు పక్కల ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అగ్రో కెమికల్ ఫ్యాక్టరీల నుండి వెలువడే వాయువుల వల్ల రోడ్లు ఈ విధంగా మారిపోతున్నాయని అంటున్నారు. రొడ్లు పింక్ కలర్ లోకి మారడమే కాదు ఇంతకుముందు ఆకుపచ్చ రంగులో వర్షం కూడా కురిసిందట. ఇటీవల డోంబివ్లీ రోడ్డులో నడిచిన వారంతా రోడ్డు పింక్ కలర్ లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

 

 

దీంతో స్థానికులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు విన్నవించుకున్నారు. ఈ విషయం మీద మహారాష్ట్ర ముఖ్యమంతి నివేదిక కోరారు. దాంతో ఇక్కడ అధికారులు పరిశీలన చేసి - రోడ్లపై మట్టి శాంపిల్స్ ను సేకరించారు. ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. రోడ్లు రంగులు మారడానికి స్థానికంగా ఉన్న కెమికల్ పరిశ్రమలు - వాటిలో నుండి వచ్చే పౌడర్ అని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లు రంగు మారడమే కాకుండా దుర్వాసన - విషవాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: