డ్రైవింగ్ లైసెన్స్ పొంద‌డం ఎంత ప్ర‌హ‌స‌న‌మో చాలామందికి అనుభ‌వ‌మే. ర‌వాణ‌శాఖ నిర్వ‌హించే వివిధ‌ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌వ‌డం, అందులో ఉత్తీర్ణుల‌వడం... అనంత‌రం లైసెన్స్ పొంద‌డం ఎంతో ఉత్కంఠ‌ను క‌లిగించేది. సుల‌భంగా, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల ద్వారా లైసెన్స్ పొందాల‌నే రూల్స్ ఉన్న‌ప్ప‌టికీ...అవి కేవ‌లం రూల్స్‌గానే మిగిలిపోతున్నాయి, బ్రోక‌ర్ల దందా రాజ్యామేలుతోంది. అయితే, ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేసేలా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. కేవ‌లం సెల్ఫీ దిగ‌డంతో లైసెన్స్ రానుంది. రవాణా శాఖ నిర్ణ‌యంతో ఈ వెసులుబాటు ద‌క్క‌నుంది.

 

33 ప్రధానమైన సేవలను  ఆన్‌లైన్‌ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీని ద్వారా కార్యాలయాలకు వచ్చే వినియోగదారుల సంఖ్య త‌గ్గించ‌నుంది. ఇందులో భాగంగా విప్ల‌వాత్మ‌క మార్పు తీసుకురానుంది. ప్ర‌స్తుత సంద‌ర్భం వ‌లే డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యూవల్‌ కోసం కార్యాలయాని కి రావాల్సిన అవసరం లేకుండానే రెన్యూవల్‌ చేసుకోవచ్చు. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి సెల్ఫీ దిగి రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా లైసెన్సు రెన్యూవల్‌ చేసి కార్డును దరఖాస్తుదారుడి ఇంటికి పంపిస్తారు. ఈ విధానాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులోకి తేనున్నారు. 

 

ఇంత‌కీ ఈ సేవ‌ను ఏ విధంగా పొందాలంటే....లైసెన్స్ పొందాల‌నుకున్న వ్య‌క్తి త‌ను కూర్చున్న చోటు నుంచే కంప్యూటర్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా రవాణాశాఖ సేవకు సంబంధించి వివరాలు ఎంచుకోవాలి. అనంత‌రం సంబంధిత విభాగంలో ఫోటో అప్‌లోడ్‌ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లో రెన్యూవలైన లైసెన్సు ప్రత్యక్షమవుతుంది. కార్డు వారం రోజుల్లో అందుతుంది. అంటే...ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి సెల్ఫీ దిగి రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా లైసెన్సు రెన్యూవల్‌ చేసి కార్డును దరఖాస్తుదారుడి ఇంటికి పంపిస్తారు.  త‌ద్వారా ఆఫీసుల వెంట తిరిగే స‌మ‌స్య త‌ప్పుతుంది. ముందుగా ఈ సౌల‌భ్యాన్ని హైద‌రాబాద్‌లో అందుబాటులోకి తీసుకువ‌చ్చి అనంత‌రం రాష్ట్రవ్యాప్తంగా అలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రులో హైద‌రాబాద్‌లో వినియోగ‌దారుల‌కు చేరువ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: