ప్రపంచంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.  వీటిబారి నుంచి బయటపడేందుకు పర్యావరణ వేత్తలు ఎంతగానో ట్రై చేస్తున్నారు.  కానీ, వేడి మాత్రం తగ్గడం లేదు.  పెరిగిపోతూనే ఉన్నది.  భూమిపై తాపం పెరగడంతో పాటుగా  భూమికి రక్షణ ఉండే ఓజోన్ పొర కు ఏర్పడిన ఇబ్బందులే కారణం అని అంటున్నారు.  ఓజోన్ పొర వలన కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకోలేదు.  


అయితే, ఇప్పుడు ఈ పొర దెబ్బతినండం మూలంగా ప్రపంచంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.  భూమిపై వేడి వాతావరణం నెలకొన్నది.  అదొక్కటి రీజన్ కాదు.  దీంతో పాటుగా భూమిపైన అడవులు నరికివేయడం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  భూమిపై ఏర్పడిన  ఇబ్బందులు కూడా వీటికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి.  

 


అంతేకాదు, మాములు ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, గతేడాది తీసుకుంటే యూరప్ లో ఎప్పుడు లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.  దీని వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఇప్పుడు మరొకటి కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నది.  అదేమంటే, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో కూడా వేడి వాతావరణం పెరిగిపోయింది.  ఈ వేడి వాతావరణం మూలంగా ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


ఎప్పుడూ లేనంతగా ఆర్కిటిక్ ప్రాంతంలో 24 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో పర్యావరణ వేత్తలు షాక్ అవుతున్నారు.  ఇది ఇలానే కంటిన్యూ అయితే, మంచు ఖండం పూర్తిగా కరిగిపోతుంది.  ఫలితంగా భూమిపై వాతావరణం సమతుల్యత దెబ్బతింటుంది.  సముద్రాల్లో నీటిమట్టం అనూహ్యంగా పెరిగిపోతుంది.  అకాల వర్షాలు కురుస్తాయి.  అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి.  అందుకే పర్యావరణ వేత్తలు భయాందోళనలు చెందుతున్నారు.  దీని నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. వేడి ఇలానే పెరిగిపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతలు కంటే సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: