ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ మారింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ శనివారం ఉదయం అమరావతికి తిరిగి రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడంతో జగన్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కలవనున్నారు జగన్. అలాగే మరికొందరు కేంద్ర కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా కలుస్తారని అంటున్నారు. 

 

శుక్రవారం సాయంత్రం జగన్ జగన్ పొద్దుపోయిన తర్వాత హోం మంత్రి అమిత్ షాని కలిసారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన చర్చించారని సమాచారం. కర్నూలుకి హైకోర్ట్ తరలింపుతో పాటుగా, మూడు రాజధానుల విషయంలో అంగీకారం, మండలి రద్దు, దిశా బిల్లు ఆమోదం వంటి అంశాలను అమిత్ షా తో జగన్ చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో అమరావతి రైతుల గురించి కూడా జగన్ ప్రస్తావించారు. విభజన హామీలను అమలు చెయ్యాలని హోం మంత్రిని జగన్ కోరినట్టు తెలుస్తుంది. 

 

ఇక పోలవరం నిధులతో పాటుగా ఆర్ధిక లోటు భర్తీ చేయడం, వంటి అంశాలను కూడా జగన్ ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. దీని నుంచి సానుకూలత కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక మూడు రాజదానులకు కేంద్రం దాదాపుగా అంగీకారం తెలిపింది అంటున్నారు. అయితే ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర పెద్దలు సూచించినట్టు సమాచారం. న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ హైకోర్ట్ తరలింపు గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే న్యాయశాఖకు సంబంధించిన కొన్ని కార్యాలయాలను కర్నులుకి తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో కేంద్రం ఏమంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: