చంద్రబాబు తరహాలోనే బొత్స సత్యనారాయణ కూడా బిజెపి, కేంద్రంతో ఘర్షణ పడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అసలు ఘర్షణ పడమని చెప్పింది ఎవరు?. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అయితే ఎన్డీయేలో చేరతామని కూడా బొత్స ప్రకటించారు.అంతే కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికి కూడా దిగుతామని బొత్స ప్రకటించారు. ఎవరి నుంచి అయినా  ఉచితంగా సాయం పొందాలంటేనో.లేకపోతే అనుచిత లబ్ది కోసం అయితే బతిమిలాడుకోవచ్చు..గడ్డాలు పట్టుకోవచ్చు.

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ... ‘‘  కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిన అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకొస్తూ, దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని  సీఎం కోరిన విషయాన్నీ ప్రస్తావించారు.

 

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేసి అపహాస్యం చేసిందన్నమంత్రి బొత్స. ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసినట్టు తెలిపారు. తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని కేంద్రానికి  విజ్ఞప్తి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ ఖండ్‌ తరహాలో విస్తరించాల్సి ఉందన్నారు. రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.

 

దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బును కేంద్రం  విడుదల చేయాల్సి ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: