క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతోంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కాని ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప్రాణాంత‌క వైర‌స్ బారిలో ప‌డి 1383 మంది మృతి చెందిరు.  ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 65000కు చేరుకున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న 1700 మంది వైద్యులు కూడా దీని బారినపడ్డారు.

 

కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతోందని భావించినప్పటికీ - ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 1383 మంది మృతి చెందారు. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 65000కు చేరుకున్నాయి. అయితే ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించే వ్యాధి కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌స్తుంది. ఈ వ్యాధి బారిన ప‌డిన  బాధితులకు చికిత్స అందిస్తున్న 1700 మంది వైద్యులు కూడా దీని బారినపడ్డారు. కరోనా కారణంగా చైనాలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమలు కూడా చాలానే మూతబడ్డాయి. దీని ప్రభావం విదేశాల్లో జ‌నాలు భ‌యాందోళ‌ణ‌లో భ‌య‌ప‌డుతున్నారు.

 

లండ‌న్‌లో ఉన్న చైనా టైన్ మొత్తం ఇటీవ‌లె రాత్రికి రాత్రి ఖాళీ అయిపోయింది. అక్క‌డ మ‌నుషులు నివ‌శించ‌డానికి చాలా భ‌య‌ప‌డుతున్నారు. ఇక క‌స్ట‌మ‌ర్లు లేక హోట‌ళ్ళు, రెస్టారెట్లు, షాపులు ఇలా అన్నీ ఈగ‌లు వాలుతున్నాయి. రోడ్డు పైన చూడ‌డానికి క‌నీసం మ‌చ్చుకైనా మ‌నిష‌నేవాడు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లె లండ‌న్‌లో ఓ హిళ‌కు క‌రోనా సోక‌డంతో బుధ‌వారం ఆ విష‌యాన్ని వైధ్యులు నిర్ధారించారు దాంతో చైనా మొత్తం భ‌యంతో ముందుగానే ఖ‌ళీ చేసేశారు.

 

ఇక లండ‌న్‌లో నిర్ధార‌ణ అయిన మొట్ట మొద‌టి కేస్ క‌రోనా వైర‌స్‌. బ్రిట‌న్ లో మాత్రం ఇది తొమ్మిదో కేసు న‌మోద‌యింది. వైరస్ సోకిన బాధితురాలిని దక్షిణ లండన్లోని గయ్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా చైనా టౌన్ రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతుండేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా గుంపులుగా ఉండే హోటల్స్ - షాపులు - ఇతర పబ్లిక్ స్థలాల్లోకి ఎవరూ వెళ్లడం లేదు. వ్యాధి సోకిన విషయం తెలియగానే చైనా టౌన్ మొత్తం ఖాళీ అవ్వ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: