మనదేశంలో ప్రాంతీయ ఉద్యమాలు కొత్తేమీ కాదు. ఒక ప్రాంతం వారి మరో ప్రాంతవాసుల గురించి కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రాంతీయ భేధాల వల్ల రాష్ట్రాలు విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం గతంలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. అపుడు తమిళుల ఆగడాలు తెలుగువారిపై ఎక్కువవుతున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించి, ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.

 

 


ఆ సమయంలో తమిళనాడు రాజధానిగా ఉన్న మద్రాసు తమిళనాడులోనే ఉండిపోయింది. అందువల్ల చాలా మంది తెలుగువాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. ఇప్పటికీ తమిళనాడులో తెలుగువాళ్ళ జనాభా చాలా ఎక్కువ. కాలనీలు కాలనీలే తెలుగువాళ్లవి ఉన్నాయంటే అక్కడ మనోళ్ళ జనాభా ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న తెలుగు వారందరినీ ఏకం చేయడానికి ఒక రాజకీయ పార్టీ పూనుకుంటుంది.

 

 

తమిళనాడు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి అయిన రామ్మోహన్ రావు తాజాగా తమిళనాట ఓ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ తెలుగు పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు రామ్మోహన్ రావు సంచలన ప్రకటన చేశారు. రామ్ మోహన్ రావు గతంలో జయలలితకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.

 

 

మొన్నామధ్య రామ్ మోహన్ రావు మీద ఐటీ దాడులు జరిపించింది అక్కడి ప్రభుత్వం. దీంతో విసుగు చెందిన రామ్ మోహన్ రావు పార్టీ ప్రారంభించడానికి పూనుకున్నారట. తెలుగు వారందరినీ ఏకం చేసి అక్కడ వివక్షతకి గురవుతున్న తెలుగు వారందరికీ సాయం అందించడనికి సిద్ధం అవుతున్నాడట. మరి తమిళనాడులో ఈ తెలుగు పార్టీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: