ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇటువంటి పరిస్ధితి వస్తుందని ఏనాడూ అనుకుని ఉండడు. అలాగే బిజెపి చంకలోకి ఎక్కి కూర్చున్నాక కూడా టెన్షన్ పడాల్సిన పరిస్ధితి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్  కూడా ఎప్పుడూ ఊహించుండడు. సరే వాళ్ళ అంచనాలు, ఊహలతో కాలానికి పనేముంది ? ఇద్దరూ ఒకేసారి టెన్షన్ పడే పరిస్ధితి జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చేసింది. అందుకే ఇద్దరూ జాయింటుగాను విడివిడిగాను తెగ ఇబ్బంది పడిపోతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే తన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఐటి దాడుల్లో తగులుకోవటంతో చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ దగ్గర 2 వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ లావాదేవీల వివరాలు దొరికినట్లు అధికారికంగా ఐటి విభాగం ప్రకటన ఇవ్వటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. చంద్రబాబులో టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

అదే సమయంలో మోడితో జగన్ భేటి అవ్వటం, తర్వాత ఒక్క రోజు గ్యాప్ లో మళ్ళీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటి జరపటంతో టెన్షన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్ధలు ఎప్పుడు రంగంలోకి దిగుతాయో తెలీక నానా అవస్తలు పడుతున్నాడు చంద్రబాబు. నిజానికి ఐటి దాడులతో జగన్ కు సంబంధం లేకపోయినా టిడిపి నేతలు మాత్రం సిఎంపైనే మండిపోతున్నారు.

 

ఇక పవన్ కల్యాణ్ విషయం చూస్తే వీలైనంతగా జగన్ ను ఇబ్బంది పెట్టేందుకే కమలంపార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఎలాగూ బిజెపికి తాను మిత్రపక్షమే కాబట్టి చంద్రబాబు తరపున కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జగన్ కతేంటో చూడచ్చని పాపం పవన్ అనుకునుండచ్చు. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మోడి వైఖరిలో మార్పొచ్చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన మిత్రులకోసం అన్నట్లుగా జగన్ తో సయోధ్య పెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు.

 

గడచిన మూడు నెలలుగా జగన్ కు అపాయిట్మెంట్ ఇవ్వని మోడి తనంతట తానుగానే సిఎంను పిలిపించుకోవటం గమనార్హం. వీళ్ళ భేటి తర్వాత జగన్ ను ఎన్డీఏలో చేరాల్సిందిగా మోడి ఆహ్వానించినట్లు మొదలైన ప్రచారంతో  పవన్ లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. జగన్ గనుక ఎన్డీఏలో చేరితో పవన్ గతేంకాను. ఇదే ఇపుడు పవన్ కు అర్ధంకాని విషయం. చూశారా ఇద్దరూ చెరో కారణంతో ఎంతగా టెన్షన్ పడిపోతున్నారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: