జనసేన బీజేపీ పొత్తు ఆదిలోనే హంసపాదులా తయారయ్యింది. పొత్తు పెట్టుకున్నామన్న సంతోషం జనసేనలో రెండు రోజులు కూడా నిలవలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు హడావుడిగా ఢిల్లీ వెళ్లి పొట్టుకున్నా ఆ పార్టీ అగ్ర నేతల దర్శనం పవన్ కు లభించలేదు. ఆ తరువాత మరోసారి బీజేపీ అగ్ర నేతలను కలిసేందుకు ఢిల్లీలో కొద్దిరోజుల పాటు పవన్ ఉన్నా బిజెపి అగ్రనేతలు పవన్ కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఆ తరువాత ఏపీలో  అమరావతి ఉద్యమం తీవ్రతరం అవ్వడంతో బీజేపీతో కలిసి వైసీపీపై దండయాత్ర చేసేందుకు పవన్ ప్రయత్నించారు. దీనికోసం విజయవాడలో రెండు పార్టీలు కలిసి లాంగ్ మార్చ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. కానీ బీజేపీ దానిని వాయిదా వేయించింది. అమరావతి వ్యవహారంలో పోరాటం చేసేందుకు బీజేపీ వెనుకడుగు వేయడంతో పాటు పవన్ నిర్ణయాన్ని వాయిదా వేయించారు. 


ఇక అప్పటి నుంచి పవన్ కు బిజెపి కి గాని దూరం పెరుగుతూనే వస్తోంది. రెండు పార్టీలు కలిసి ఏపీ లో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేస్తాయని ఆశించిన జనసేన నాయకులు బిజెపి వ్యవహారం మింగుడు పడలేదు. ఇక పవన్ కళ్యాణ్ కర్నూల్ లో పర్యటించి మూడేళ్ళ కృత జరిగిన అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని గళం వినిపించారు. కానీ పవన్ పర్యటనలో బిజెపి నాయకులు ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆ విషయంపై స్పందించేందుకు కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదు. అమరావతి లో ఈ రోజు పవన్ పర్యటించారు. కానీ బీజేపీ దానికి దూరంగానే ఉండడంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. 


ఇక మొదటి నుంచి పవన్ వ్యతిరేకిస్తున్న జగన్ కు బీజేపీ మద్దతు పలకడం, ఆయన నిర్ణయాలకు మద్దతు ఉంటుందని చెప్పడంతో పాటు తాను అభిమానించే చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ఐటీ దాడులు చేయించడం పవన్ నచ్చడంలేదు.అదీ కాకుండా వైసిపికి రెండు మంత్రి పదవులు కూడా కేటాయించేందుకు బిజెపి నేతలు సిద్ధమవుతున్నారు అనే వార్త పవన్ కు రుచించడంలేదు. ఇక బీజేపీ వ్యవహారం ఈ విధంగా ఉండటంతో తను పొత్తు పెట్టుకున్నా ఉపయోగం లేదని, రాజకీయంగా తమకు ఇబ్బంది తెచ్చే బీజేపీతో పొత్తు రద్దు చేసుకుంటేనే బెటర్ అన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: