వాడుకోవ‌డ‌మే త‌ప్ప ఉప‌యోగ‌ప‌డ‌డం తెలియ‌ని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనే! అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకుప్రాంతీయ పార్టీలు జంకుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌తంలో ఏపీలో జ‌రిగిన అనుభ‌వం తో పాటు బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో జ‌రిగిన అనుభ‌వాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ వ్యూహాలు త‌న పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు త‌ప్ప‌.. ఇత‌రుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. చంద్ర‌బా బుతో అంట‌కాగిన బీజేపీ.. మిత్ర బంధానికి పెద్ద‌గా విలువ ఇవ్వ‌లేదు.

 

కేంద్రంలో త‌న ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవడంలో చూపిన ఆస‌క్తి.. రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. మాత్రం బీజేపీ ప‌ట్టించుకోలేదు. ఈ ప‌రిణామ‌మే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, బీజేపీకి మ‌ధ్య గ్యాప్ పెంచింది. తీవ్ర యుద్ధానికి కూడా దారితీసింది. దీంతో ఈ రెండు పార్టీలూ విడిపోయాయి. మ‌ళ్లీ క‌లుసుకోలేనంత‌గా ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇక‌, ఇప్పుడు అలాంటి పార్టీతో జ‌ట్టుక‌ట్టేందుకు (పైకి ఎన్డీయే అంటున్నా.. మెజారిటీ భాగ‌స్వామ్య పార్టీ బీజేపీనే) వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడీ అవుతున్నారు. దీనికి రెండు కార‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

 

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. ఆయ‌న‌పై న‌మోదైన కేసులు ఒక‌టి ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న కార‌ణం. రెండు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్ర‌త్యేక హోదా..! ఈ రెండు కార‌ణాల‌తోనే జ‌గ‌న్ బీజేపీతో జ‌ట్టుకురెడీ అవుతున్నార‌నేది నిర్వివాదాంశం. అయితే, తొలి విష‌యంలో బీజేపీ స‌హ‌క‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అంటే.. జ‌గ‌న్‌కు ఇప్ప‌టికిప్పుడు క్లీన్ చిట్ ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌న‌ను లొంగ దీసుకునే క్ర‌మంలో ఆయా కేసుల‌ను తొక్కిపెట్టేందుకు కేంద్రం దూకుడు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంటుంది.

 

ఇది ఒక‌ర‌కంగా జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్‌. ఇక‌, రెండోది రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు. ఈ విష‌యంలో మాత్రం బీజేపీ పెద్ద‌గా స‌హ‌క‌రించేఅవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ స‌హాయం చేసినా.. పోల‌వ‌రం వంటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌నుంది. అంతే త‌ప్ప హోదా విష‌యాన్ని మాత్రం ప‌ట్టించుకోదు. సో.. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల్లో త‌నకు వ్య‌క్తిగ‌త ల‌బ్ధి క‌నిపించినా.. రాజ‌కీయంగా ఆయ‌న న‌ష్ట‌పోయే ప్ర‌భావం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: