ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డబుల్ గేమ్ ఆడటం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఇన్నాళ్ళు డ్రామాలు మాత్రమే ఆడిన బిజెపి ఇప్పుడు నాటకాలకు శ్రీకారం చుడుతుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో ప్రయాణం అని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు వైసీపీ ని ఎన్డియే లోకి చేర్చుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ రాజకీయమే ఆశ్చర్యంగా మారింది. అసలు ఎందుకు ఈ విధంగా బిజెపి ప్రవర్తిస్తుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. 

 

రాజకీయంగా బిజెపికి ఆంధ్రప్రదేశ్ ఒరిగేది ఏమీ ఉండదు. దక్షినాదికి నిధులు ఇవ్వడానికి ఆ పార్టీకి ఎలాగూ మనసు రాదు కాబట్టి హిందుత్వం అని ఆ పార్టీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆ పార్టీ రాజకీయంగా బలపడాలి అంటే జాగ్రత్తగా రాజకీయం చెయ్యాలి గాని ఒక చేత్తో వైసీపీ మరో చేత్తో పవన్ కళ్యాణ్ ని సుజనా చౌదరి సహకారంతో టీడీపీ ఆడిస్తే కష్టంగా ఉంటుంది. ఇప్పటికే బిజెపి విషయంలో జనాలు చాలా వరకు చికాకుగానే ఉన్నారు. ఇప్పుడు తెరలేపిన ఈ కొత్త డ్రామా వైసీపీని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీని విభజన హామీల విషయంలో టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వంటి విషయాల్లో వైసీపీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదాను లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు విమర్శలు చేసింది వైసీపీ. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో క్లారిటి ఇవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడటం ఖాయం. అదే విధంగా ఎన్నార్సి, పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా వైసీపీ క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం టీడీపీ వాటినే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: