గత కొంత కాలంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక నిన్న హుటాహుటిన హస్తినకు బయల్దేరి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం వరుసగా బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎన్డీయే కలవటానికి లో జగన్ సర్కారు మంతనాలు జరుపుతున్నారని వార్తలు కూడా రావడం మొదలయ్యాయి. 

 


 తాజాగా ఈ వార్తలపై బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ స్పందించారు. బీజేపీతో వైసిపి కలుస్తుంది అనే విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని...  తాము రాష్ట్రంలో జనసేనతో మాత్రమే పొత్తుపెట్టుకుంటాము  అంటూ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జనసేనతో  కలిసి పోటీ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధానిని  కలుస్తూనే ఉంటారని దానికి వేరే అర్థాలు తీసుకోవద్దు అంటూ సునీల్ దియోధర్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్కార్ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు సునీల్ దియోధర్. 

 

 బిజెపి పార్టీ రాజధాని అమరావతి లో కొనసాగేందుకే  మద్దతిస్తుందని రాజధాని మార్పు వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. టిడిపి వైసిపి పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని అంటూ వ్యాఖ్యానించారు ఆయన... శాసన మండలి రద్దు అనేది ఏకపక్ష నిర్ణయం అంటూ విమర్శించారు. జగన్ సర్కారు ఒంటెద్దు  పోకడ వెళ్తున్నదని... రాష్ట్రంలో ఓకే రాజధాని ఉండటమే బిజెపి నినాదం అంటూ తెలిపారు. అయితే  పౌరసత్వ  సవరణ చట్టానికి పార్లమెంటులో మద్దతు ఇచ్చిన వైసీపీ సభ్యులు బయట మాత్రం వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తామని అనటం ఏంటని ప్రశ్నించారు... దీనిపై వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ .

మరింత సమాచారం తెలుసుకోండి: