రావోయి సెంద్ర మామ ... మా బాధలు గాధలు వినుమా ! రావోయి సెంద్ర మామ. ఏ ఏంటమ్మా మీ గోల పొద్దు పొద్దున్నే. ఇక్కడ మా బాధలు ఎవడికి చెప్పుకోవాలో తెలియక కిందా మీద పడుతుంటే ! పాటలు పాడి మరీ న్యూసెన్స్ చేస్తారా ..? ఏయ్ కిట్టూ అర్జంటుగా నీ టీవీలో పేపర్ లో వేళ్ళ గురించి రాసేయ్. బాబోరు మేము మీ పార్టీ వోళ్ళమే అండి. మీరే ఇలా కస్సు బస్సు అంటే మేమెవరికి చెప్పుకోవాలయ్యా! మా బాధలు. ఏంటమ్మా మీ బాధలు అసలే ఇల్లు కాలి ఒకడు ఏడుత్తుంటే అదేదో కాలిందని ఇంకొకడు ఏడవడం అంటే ఇదే మరి. మీకేంటి ఇక్కడ నాకే కిందా మీద కాలిపోతోంది. ఆ పువ్వు పార్టీ వాళ్ళకి ఎంత దైర్యం ఉంటే నా మీద, నన్ను నమ్ముకుని నా కులపోళ్ల మీద ఆ ఐటీ రైడ్స్ చేయిస్తారా ? 


నా సంగతి తేలినట్టుంది. గతంలో నేను ఢిల్లీ రాజకీయాల్లో చక్రాలు, బొంగరాలు తిప్పేశాను. పోన్లే అని పువ్వు పార్టీ వాళ్ళు కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. నా పీఎస్ దాచుకున్న సొమ్ములు, సీక్రెట్లు పట్టుకెళ్లిపోవడానికి వాళ్లకెంత ధైర్యం..? మళ్ళీ నన్ను అరెస్ట్ చేయిస్తారని ప్రచారం చేయిస్తారా ? నేను నిప్పునమ్మా ముట్టుకుంటే కాలిపోతారు. నన్ను సరే నా దత్త పుత్త్రుడిని చేరదీసి దూరం పెట్టి ఆ పసివాడి రాజకీయ జీవితంతో ఆడుకుంటున్నారు కదా ! నేనేమి చూస్తూ ఊరుకోను మీ అందరి సంగతి చూస్తా ... మీ అంతు తేల్చేస్తా ! 


ఊరుకోండి సెంద్రల సారూ ఊరుకోండి. అయినా ఐటీ వొళ్ళు పట్టుకుంది ఆఫ్ట్రాల్ రెండువేల కోట్లే కదా ! మీకు అది ఓ లెక్కా ఏంటి ? అయినా మీ పుత్ర రత్నం మాలోకం సెప్పేసాడు కదా కొండను తవ్వి ఎలుకను పట్టారని. అంటే ఇంకెన్ని ఎలుకలు, తిమింగలాలు ఎక్కడ దాక్కున్నాయి మీకే తెలుసు కదా ! అవునమ్మా నాకే తెలుసు. అంటే మీరు బా....గా వెనుకోసుకున్నారా ? ఏంటయ్యా నువ్వు మన పార్టీ వొడినన్నావ్..? ఇప్పుడు నన్నే ఇరికిస్తున్నావ్ ? పిచ్చ కథలు చేయకు అర్ధం అయ్యిందా ? అర్ధం అయ్యింది సర్ ! ఏమర్థం అయ్యింది ? మీరే ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద అవినీతి తిమింగలం అని మీ పుత్ర రత్నం పెద్ద డైనోసార్ అని.

 

అసలు ఇలాంటి పార్టీలో ఇప్పటివరకు నేను ఉన్నందుకు నా చెప్పుతో నేనే .... ? వెళ్లిపోతున్నా ! పో పోవయ్యా ! నువ్వు కాకపోతే ఇంకొకడిని తయారు చేసుకుంటా ! నాకు నా కిట్టూ ఉన్నాడు నేను సోది చెప్పినా బ్రమ్మ వాక్కులా చిత్రీకరించే మా కులపోళ్ల మీడియా ఉంది. అయినా నాకెందుకు భయం..? ఇక్కడ ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ.    

మరింత సమాచారం తెలుసుకోండి: