ప్రస్తుతం చైనా దేశాలో  మరణమృదంగం మోగిస్తోంది  కరోనా వైరస్. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ  ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే 1500 మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక 65 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వేరస్ కు సరైన వాక్సిన్  కూడా లేకపోవడంతో... ఇక ఈ వ్యాధి సోకితే చనిపోవడం తథ్యంగా మారింది . ఇకపోతే ఈ ప్రాణాంతకమైన వ్యాధితో చైనా ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఈ వ్యాధి సోకి  ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

 


 ఒక మరోవైపు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది  ఈ కరోనా వైరస్.చైనాలో ఉదృతంగా ప్రభావం చూపిస్తున్న ఈ ప్రాణాంతకమైన అటు జపాన్లో నూ ఉనికిని  ప్రదర్శిస్తోంది. మూడు వేల మంది ప్రయాణికులతో యొకహోమా రేవులో నిలిచి పోయిన  జపాన్ విహారనౌకా  డైమండ్ ప్రిన్సెస్ లో కూడా కరోనా  వైరస్ ఛాయలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నౌకలోని ప్రయాణికులలో 289 లో కరుణ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే నౌకలోని ఇద్దరు భారతీయులకు కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారించిన అధికారులు తాజాగా మరో భారతీయుడు కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇక డైమండ్ ప్రిన్సెస్  లోని కరోనా  ప్రభావిత ప్రయాణికులకు ఆసుపత్రికి తరలించి  ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. 

 

 అయితే ప్రస్తుతం డైమండ్ ప్రిన్సెస్ నౌకలో  ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడిన ముగ్గురు భారతీయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు జపాన్ లోని భారత రాయబార వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే అటు భారతదేశంలో కూడా ఈ వైరస్ ఇప్పటికే పెంచిన విషయం తెలిసిందే. కేరళలోని ముగ్గురు వ్యక్తులకు ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ సోకినట్లుగా  అధికారులు గుర్తించారు  కాగా ప్రస్తుతం వారిని ఐసోలేషన్ వార్డుల్లో  ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా  అనుమానితులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: