వైసిపి పార్టీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు రాష్ట్రంలో మరియు దేశంలో కూడా సంచలనంగా మారుతున్నాయి. కేవలం ఎనిమిది నెలల పరిపాలనకి దేశస్థాయిలో జగన్ పరిపాలనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. ఇటువంటి తరుణంలో తనకంటూ రాష్ట్రంలో ప్రత్యర్థి లేకుండా చేసుకోవటానికి చకచకా పనులు కానిచేస్తున్నాడు. అసలు సిసలైన ప్రత్యర్థి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను అదేవిధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన బాగోతాన్ని బట్టబయలు చెయ్యడం కోసం జగన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇదే టైమ్ లో తనకు పక్కలో బాల్లెం లాగా ఉంటూ భయంకరమైన విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా జగన్ తాజాగా టార్గెట్ చేసినట్లు సమాచారం.

 

చాలా సందర్భాలలో ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక కొరత సమయంలో ఏపీ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి పవన్ చేసిన ప్రయత్నాలకు వైసీపీ నేతలు కూడా కొద్దిగా భయపడ్డారు. ఇందుమూలంగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి హైలెట్ చేయకుండా చాలా సైలెంట్ గా అతని విషయంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ ని కూడా తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని జగన్ సంచలన ఎత్తుగడ వేసినట్లు సమాచారం. త్వరలో రాజ్యసభ పదవులు వైసిపి పార్టీ కి ఎక్కువ రాబోతున్న ఈ నేపథ్యంలో ఒక రాజ్యసభ స్థానాన్ని చిరంజీవికి ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.

 

గతంలోనే సైరా సినిమా విడుదల సమయంలో జగన్ని చిరంజీవి కలిసిన ఈ సందర్భంలో ఈ వార్తలు కూడా రావడం జరిగాయి. అయితే తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన తర్వాత ఈ వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని రంగంలోకి దింపి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ని ఆటలో అరటిపండు చేయాలని జగన్ ఎత్తుగడ అన్నట్టు వైసీపీ పార్టీలో టాక్. అయితే ఇదే సమయంలో వైసీపీలోకి చిరంజీవి వస్తే జగన్ కే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఎప్పటికైనా అన్నదమ్ములు అయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకటవుతారు...చరిష్మా పరంగా జగన్ కంటే చిరంజీవికి మంచి క్రేజ్ ఉంది దీంతో వైసిపి పార్టీ కి కష్టాలు రావొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: