ఏపీ సీఎం వైయస్ జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీతో దాదాపు గంట సమయం భేటీ అయిన జగన్ నిన్న అమిత్ షా తో అరగంట భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల గురించి ప్రధానంగా సీఎం జగన్ మోదీ, అమిత్ షాలతో చర్చించినట్టు తెలుస్తోంది. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోదీ కేబినేట్ లో వైసీపీ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ కేంద్ర కేబినేట్ లో చేరే వైసీపీ మంత్రుల జాబితాను కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి నుండి కేంద్ర కేబినేట్ లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కుతుందని భావించినా కొన్ని కారణాల వలన విజయసాయిరెడ్డి పేరును జగన్ ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. 
 
విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుడిగా ఉండటంతో పాటు పార్లమెంటరీ నేతగా కూడా ఉన్నారు. జగన్ విజయసాయిరెడ్డి కొన్ని కేసుల కారణంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో కేంద్ర కేబినేట్ లో ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. అమిత్ షా సీఎం జగన్ ను ఏపీకి వచ్చే రాజ్యసభ సీట్లలో ఒకటి బీజేపీకి కేటాయించాలని కోరినట్టు అమిత్ షా ప్రతిపాదనకు జగన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
కేంద్ర కేబినేట్ లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి, కాకినాడ ఎంపీ వంగా గీతకు లేదా అమలాపురం ఎంపీ చింతా అనురాధకు జగన్ ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జగన్ అమిత్ షాను శాసనమండలి రద్దుకు ఆమోదం తెలపాలని కోరినట్టు అమిత్ షా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో మోదీ కేబినేట్ ను విస్తరించనున్నారని సమాచారం. కేంద్ర కేబినేట్ లో వైసీపీ ఎంపీలకు చోటు దక్కితే జగన్ పవన్ కు చంద్రబాబుకు చెక్ పెట్టినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: