ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొత్త స్కిమ్స్ ను ప్రవేశ పెడుతుంటారు. అలాగే  2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ సీజన్ చివరకు వచ్చేసింది. మీరు ఇప్పటికే పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను తగ్గింపు పరిమితిని దాటేసి ఉంటే.. మీకు ఇంకో ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఎన్‌పీఎస్ స్కీమ్.

 

ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో చేరడం వల్ల సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద అదనంగా మరో రూ.50,000 వరకు పన్ను తగ్గింపు పొందొచ్చు. మీరు ఇప్పటికే ఎన్‌పీఎస్ అకౌంట్‌ను ప్రారంభించి ఉంటే.. అందులోని కంట్రిబ్యూషన్‌పై అదనపు పన్ను ఆదా ప్రయోజనాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం ట్యాక్స్ మాత్రమే కాకుండా ఎన్‌పీఎస్ ద్వారా రెగ్యులర్ పెన్షన్ కూడా పొందొచ్చు. సెక్షన్ 80సీసీఈ కింద సెక్షన్ 80సీ, సెక్షన్ 80సీసీసీ, సెక్షన్ 80సీసీడీ(1) సెక్షన్ల ద్వారా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను తగ్గింపు లభిస్తుంది.

 

మీరు నెలకు రూ.4,167 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. 30 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు రూ.15 లక్షలు అవుతుంది. 60 ఏళ్లప్పుడు మీ మెచ్యూరిటీ డబ్బు రూ.94.97 లక్షలుగా ఉంటుంది. ఇందులో 60 శాతం డబ్బును అంటే రూ.57 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 40 శాతం అంటే రూ.38 లక్షలు మిగులుతుంది. దీనిపై మీకు నెలకు రూ.19,000 పెన్షన్ వస్తుంది.

 

ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2 అనే రెండు అకౌంట్లు ఉంటాయి. టైర్ 1 పెన్షన్‌కు సంబంధించిన అకౌంట్. ఇది తప్పనిసరి. ఇక టైర్ 2 అనేది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. దీనిపై పన్ను ప్రయోజనాలు ఉండవు. టైర్ 1 అకౌంట్‌లో సంవత్సరానికి రూ.500, టైర్ 2 అకౌంట్‌లో ఏడాదికి రూ.1,000 కనీసం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: