ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఏ చిన్న విషయం చెప్పినా ఆసక్తిగా వినే ప్రజలు ఎంతోమంది ఉంటారు. నరేంద్ర మోడీని దేవుడి లాగా పూజించే ప్రజలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి భక్తులకు సాక్షాత్తు ప్రియమైన మోడీ లేఖ రాస్తే వారు ఎంతగా సంతోషిస్తారో మాటల్లో వర్ణించలేం. ఇటువంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లోని డూమ్రీ గ్రామంకు చెందిన మంగళ్ కెవాత్ అనే రిక్షావాలాకు జరిగింది. అసలు రిక్షావాలా కూతురికి మోడీ లేఖ రాయడమేంటనే కథా కమామీషు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



పూర్తి వివరాల్లోకి వెళితే... రిక్షావాలా మంగళ్ కెవాత్ రేయింబవళ్ళు రిక్షా తొక్కి కొన్ని లక్షల రూపాయలు సంపాదించి తన కూతురిని మంచి కొలువున్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే తన కూతురు పెళ్లి ఫిబ్రవరి 12వ తారీకున నిశ్చయించారు. దీంతో అతడు తన బంధుమిత్రులందరికి కూతురి పెళ్లి వివాహ ఆహ్వాన కార్డును అందజేశాడు. పెళ్లి కార్డును స్వీకరించిన వారిలో ఒక విఐపి కూడా ఉన్నారు. ఆ విఐపి మరెవరో కాదు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మంగళ్ కెవాత్ మిత్రలు మోడీని తన కూతురు పెళ్ళికి ఆహ్వానించాలని కోరి వివాహ పత్రికను రెండు కార్యాలయాలకి పంపించమని సూచించారు. దీంతో మంగళ్ కెవాత్ ఒకటి ఢిల్లీ కార్యాలయానికి మరొకటి ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని ఆయన కార్యాలయానికి పంపించాడు.



ఆ తర్వాత తన కూతురి పెళ్లి పనుల్లో మునిగిపోయి చివరికి ఫిబ్రవరి 12వ తారీకున పెళ్లిని జరిపిస్తున్నాడు. ఆ సందర్భంలోనే ఒక పోస్ట్ మాన్ వచ్చి రిక్షావాలాకు ఒక లేఖని ఇచ్చి వెళ్ళిపోయాడు. విషయమేంటో తెలుసుకోవాలని ఆ లేఖను మరొకరికి ఇవ్వగా... అది చదివిన వ్యక్తి ఆశ్చర్యపోయి... నీకు మీ కుమార్తె కు అభినందనలు తెలుపుతూ... ప్రధాన మోడీ తమ ఆశీస్సులను పంపారు అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయిన రిక్షావాలా పెళ్లి మండపంలోనే అత్యధికంగా సంతోషపడుతూ కన్నీరుమున్నీరవుతూ ఈ విషయాన్ని తన బంధువులకి కూతురికి తెలియపరిచాడు. దీంతో ఆ మండపంలో సందడి ఫుల్లుగా పెరిగిపోయింది.



ఈ విషయం కొద్దిరోజుల తర్వాత అందరికీ తెలియడంతో మీడియా రిక్షావాలా ఇంటికి చేరుకొని అతడు ఎలా ఫీల్ అవుతున్నాడో అడగగా... 'మోడీ నుంచి లేఖను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు... ఆయన తన బంగారం మనసుతో నా కూతురిని ఆశీర్వదించారు. అందుకు నేను బాగా సంతోష పడుతున్నాను', అని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: