తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తుందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజకీయంగా తెలంగాణా లో బలపడటానికి గాను గట్టి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి నేతలు, ఇప్పుడు ఇక ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడానికి గాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తెరాస నేతలకు గాల౦ వేయగా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకోవడంతో వెళ్ళాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా సైలెంట్ అయిపోయారు అనే చెప్పాలి. దీనితో క్యాడర్ ఉన్న నాయకుల మీద దృష్టి పెడుతుంది బిజెపి. 

 

ఈ నేపధ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోసం రంగంలోకి దిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి గాను ఆయన ఇప్పుడు ఒక ఆఫర్ కూడా ఇచ్చారని సమాచారం. బిజెపిలోకి వస్తే కేంద్ర పార్టీలో పదవి ఇవ్వడంతో పాటుగా ఎంపీగా పదవి కాలం పూర్తి అయిన తర్వాత గెలిస్తే ఏమీ లేదు గెలవకపోతే మాత్రం తాము రాజ్యసభ సీటు ఇస్తామని, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారట. దీనికి రేవంత్ కూడా సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. 

 

రాజకీయంగా రేవంత్ కి మంచి ఇమేజ్ ఉన్నా సరే ఆయనకు కాంగ్రెస్ నేతల నుంచి సరైన సహకారం మాత్రం అందడం లేదనే విషయం కొన్ని రోజుల నుంచి స్పష్టంగా అర్ధమవుతుంది. దీనితో రేవంత్ కూడా అసహనంగానే ఉన్నారు. ఆయన రాష్ట్ర పార్టీ బాధ్యతలను ఇవ్వాలని కోరుతున్నా దానికి సోనియా గాంధి అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆయన వేరే పార్టీలకు వెళ్ళే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిని తెలుసుకున్న కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఈ ఆఫర్ ఇచ్చారని సమాచారం. వచ్చీ రావడంతోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలను కూడా ఇస్తామని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: