ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి ప్రాంత రైతులు అందరు భగ్గుమన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అమరావతి రైతులు. జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అమరావతి నుంచి రాజధాని మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసనలు ధర్నాలు ఆపేది  లేదంటూ స్పష్టం చేశారు అమరావతి రైతులు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులకు విపక్ష పార్టీ ఏదైనా టిడిపి జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.అమరావతి ప్రాంత గ్రామంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పర్యటించారు. 

 


 ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రైతులకి జనసేన పార్టీ  మద్దతు ఎప్పుడు ఉంటుందని  తెలిపారు. జనసేన పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు. అమరావతి నుంచి రాజధాని తరలించకుండా అడ్డుకుంటామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరు తన వెంట నడిచిన నడవక పోయినా తాను మాత్రం ఎప్పుడూ రైతులకు అండగానే ఉంటాను అంటూ స్పష్టం చేశారు. ప్రజల ఓట్లతో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ప్రజలను తొక్కేస్తుంది అంటూ ఆగ్రహం పవన్ కళ్యాణ్. 

 

 ఈ సందర్భంగా అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అమరావతి గ్రామాల పర్యటనలో భాగంగా... మనసులో మాటను బయటపెట్టారు. రైతులు చేస్తున్న  నిరసనలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జై అమరావతి అంటూ నినదించాలని  రైతులు కోరారు... అయితే జై అమరావతి అని తాను అనలేనని జై అమరావతి అంటే మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్ని ప్రాంతాలూ ముఖ్యమే అంటూ వ్యాఖ్యానించారు  పవన్ కళ్యాణ్..జై  అమరావతి అనాలన్న    రైతుల కోరికను  తోసిపుచ్చారు. పవన్ మాటలతో  రాజధాని రైతులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమరావతి పై ప్రసంగం లో  పవన్ కళ్యాణ్ మరోవైపు అమరావతి నుంచి రాజధాని తరలిస్తే  సహించేది లేదంటూ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: