తెలంగాణ ఆర్టీసీ రూపు రేఖలు మార్చిన ఘటన గత సంవత్సరం జరిగిన ఆర్టీసీ బంద్.. చరిత్రలో ఎన్నడు లేనంతగా ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నేతల మాటలు పట్టుకుని చాలా రోజుల వరకు బందులో పాల్గొనడమే గాక, ఎందరో కార్మికుల ప్రాణాలు కూడా బలి అయ్యాయి.. ఇక ఈ ఘటన వల్ల తెలంగాణ ఆర్టీసి సంస్ద మూతవేయవలసిన పరిస్దితులు తలెత్తాయి. దీని వల్ల కార్మికులే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడటంతో పాటుగా, జేబులు గుళ్ల చేసుకున్నారు.. ఈ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది...

 

 

చివరికి తెలంగాణ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. కాని తెలంగాణ ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరిగింది. ఫలితంగా అధిక చార్జీల భారాన్ని మోయవలసి వస్తుంది. ఇకపోతే అటూ ప్రభుత్వం బాగానే ఉంది. ఇటు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు బాగానే చేసుకుంటున్నారు. ఈ బందుకు ఏమాత్రం సంబంధం లేని ప్రజలకు మాత్రం కన్నీటినే మిగిల్చారు.. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ చచ్చి బ్రతికింది.

 

 

ఇకపోతే ఆర్టీసీ కార్మికులకు కేసీయార్ వరాల మీద వరాలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతుంది. అదేమంటే, ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సునీల్ శర్మ ప్రకటించారు. ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కేఎంపీఎల్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు..

 

 

ఇదే కాకుండా ఈ కార్యక్రమంలో ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులను అందించారు.. ఉద్యోగుల భద్రతకు సంబంధించిన విషయాలతో పాటుగా, బదిలీలు, తదితర అంశాలపై సైతం చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే కార్మికుల సమష్టి కృషితో నెలకు రూ.80 నుండి 90 కోట్ల వరకు అధిక ఆదాయం వచ్చిందని, ఇలాగే సంస్థ ముందుకు సాగితే డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలనే, ఆలోచనలో సంస్థ ఉందని వివరించారు..

 

 

ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపిస్తున్న ప్రేమ వెనక కారణం ఒకటుందని, సమ్మె సమయంలో కఠినంగా వ్యవహరించిన కేసీయార్ క్రమక్రమంగా కార్మికులను తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలోని భాగంగా ఇలా వరాలు కురిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: