మెట్రో రైలు ప్రారంభోత్సం జరిగిన వారం రోజులు తరువాత అధికార తెరాస , బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలయింది . తెలంగాణ తెరాస కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ నాయకత్వం అందివచ్చిన ప్రతీ  అవకాశాన్ని వినియోగించుకుంటూ  ,  అధికారపార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని చేస్తోంది . ఇక తాజాగా  మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ విస్మరించిందని  హోంశాఖ సహాయశాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు .

 

 జేబీస్ నుంచి ఎంజీబీస్  వరకు మెట్రో కారిడార్ ను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించిన విషయం తెల్సిందే . అయితే ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో , హోర్డింగ్ లలో  ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం పట్ల కిషన్ రెడ్డి తీవ్ర అసహనం  వ్యక్తం చేశారు .  కిషన్ రెడ్డి చేసిన  విమర్శలపై రాష్ట్ర మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ మెట్రో ప్రారంభోత్సం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు , హోర్డింగ్ లు ఇంకా  అలాగే ఉన్నాయని , వాటిపై మోదీ ఫొటో ఉందో , లేదో వెళ్లి కిషన్ రెడ్డి చూసుకోవాలని అన్నారు . ఇక కిషన్ రెడ్డిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదన్న ఆరోపణ సరికాదని ,  అధికారులతోపాటు  తానే స్వయంగా ఫోన్ చేసి ఆయన్ని ఆహ్వానించినట్లు చెప్పారు  .

 

ఒకవేళ  కిషన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది కలిగి ఉన్న ... అది కావాలని చేసింది కాదని అన్నారు  . మెట్రో రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే త్వరగా ప్రారంభించినట్లు తెలిపారు .  రాష్ట్ర ప్రభుత్వం పై కిషన్ రెడ్డి విమర్శలు చేయడం కాదని , కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు . బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం పసలేదని తలసాని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: