తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించి... ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి... ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక రెండు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి... తనదైన పాలనకు తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో  వినూత్న పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలందరికీ పెద్దన్న గా మారిపోయారు. అలాంటి గులాబీ  దళపతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వచ్చిందంటే రాష్ట్రంలో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ తన 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలపాలి అంటూ మంత్రి కేటీఆర్ సూచించిన విషయం తెలిసిందే. 

 

 అయితే మామూలుగానే గులాబీ దళపతి అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ... ఓవైపు మొక్కలు నాటడం తో పాటు మరోవైపు సంబరాలు కూడా చేసుకుంటారు. మిగతా నియోజక వర్గాల్లో వేడుకలు ఎలా ఉన్నప్పటికీ... రాష్ట్రం మొత్తం చూపు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గం పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గజ్వేల్ ప్రజలందరూ తమ  ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఒక ప్రత్యేకమైన గిఫ్టు సిద్ధం చేశారు. కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు అందరూ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. 

 

 భావి తరాలకు పచ్చని చెట్ల ఆవశ్యకత... చెట్లతో   ఆరోగ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి తోడవుతునే  ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గజ్వేల్ ప్రజలు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ వేదికగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మొక్కలు చేతపట్టి సమూహంగా ప్రదర్శన చేపట్టారు. ఏకంగా 66 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,600 మంది కార్యకర్తలు అభిమానులు కలిసి హరిత స్ఫూర్తిని చాటుకున్నారు. అందరూ మానవహారంగా నిల్చొని తమ అభిమాన నేత కెసిఆర్ ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కార్యక్రమం చేపడుతున్నారు. దీన్ని  నియోజకవర్గంలోని టిఆర్ఎస్ ముఖ్య నేతలందరూ పర్యవేక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: