అవును.. మీరు చదివింది నిజమే.. చంద్రబాబు కోసం జగన్ పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. అంటే అదేదో చంద్రబాబు కోసం కాదనుకోండి.. చంద్రబాబు మూడు రాజధానులకు, ఇంగ్లీష్ మీడియం వంటి పథకాల అమలుకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో.. ఆయన మనసు మార్చాలంటూ వైసీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు జరుపుతున్నారు.

 

మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ వద్ద ప్రజల వద్ద నుంచి కొల్లగొట్టిన రూ. 2 వేల కోట్లు పట్టుబడడం చంద్రబాబు అవినీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల డబ్బును దోచుకున్నారని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని.. రాయదుర్గం మండలం మురిడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి వినతిపత్రం అందజేశారు.

 

 

అధికార వికేంద్రీకరణ స్వాగతిస్తూ వైయస్‌ఆర్‌ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కార్యకర్తలు, నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాధించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లాలోని జంగారెడ్డిగూడెం బస్‌స్టాప్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

 

 

ఐటీ సోదాల్లో ఎలుకలు దొరికాయని.. ఇంకా సోదాలు చేస్తే ఏనుగులు, ఒంటెలు బయట పడతాయని వైసీపీ ఎమ్మెల్యే విఆర్‌ ఎలిజా అన్నారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా చేపట్టిని రిలే నిరాహార దీక్షలు పన్నెండవ రోజు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా సింగరాయకొండ, టంగుటూరు, కొండెపిల్లోనూ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: