ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ విధంగా చూసినా సరే బలపడాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందే. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా తెలుగుదేశం పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాని ఇక్కడ చినబాబు వ్యావహారశైలితో పార్టీ ఇబ్బంది పడుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇన్నాళ్ళు బిజెపితో వైసీపీతో యుద్ధం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా చినబాబు మీద యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది అంటూ తమ సన్నిహితుల వద్ద వాపోయే పరిస్థితి ఏర్పడింది. 

 

ఇటీవల గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కి కాస్త రాజకీయంగా మైలేజ్ ఎక్కువగా వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి అమరావతి పరిరక్షణ జెఎసి పిలుపునివ్వగా దానికి అందరికంటే ముందుగా గల్లా జయదేవ్ బయటకు వచ్చారు. పోలీసుల కళ్ళు గప్పి ఆయన రాజధాని ప్రాంతానికి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేసారు. దీనితో రాజధాని ప్రాంత రైతులతో పాటుగా టీడీపీలో కూడా ఆయన హీరో అయ్యారు. ఇక కాస్త తెలిస్తే ఎంతో ప్రచారం చేసే టీడీపీ సోషల్ మీడియా ఈ విషయంలో గల్లాను ఆకాశానికి ఎత్తేసింది. 

 

ఇదే చినబాబుని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఒక సమావేశానికి గల్లాతో పాటుగా చినబాబు కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన యువ కార్యకర్తలు గల్లాతో ఫోటోలు దిగడం మొదలు పెట్టారు. ఇది పక్కనే ఉండి చూసిన చినబాబు ఎక్కువగా మధన పడినట్టు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను ఉంటే తనను కాదని గల్లాతో ఫోటో దిగడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో కొందరు వైసీపీ కార్యకర్తల పేరుతో గల్లాను బూతులు కూడా ఆయన తిట్టి౦చారని సమాచారం. ఈ విషయం గల్లాకు తెలియడంతో కాస్త సైలెంట్ అయ్యారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: