దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి గా అరవింద్ కేజ్రివాల్ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా సిద్దం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఎక్కడా కూడా బిజేపికి అవకాశం ఇవ్వకుండా ఘన విజయం తన ఖాతాలో వేసుకున్నారు కేజ్రివాల్. తాను చేసిన అభివృద్ధి పనుల తో ప్రజల్లోకి వెళ్ళిన ఆయన వారి మద్దతు తో మూడో సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడాని కి సిద్దం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం ఆయన ఎవరిని ఆహ్వానించాలి అనే దాని పై కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

దేశ రాజధాని ఢిల్లీలో పనిచేస్తున్న  పారిశుద్ధ్య కార్మికులను వీఐపీలుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కీలక రాజకీయ నాయకులకు స్వాగతం ఉంటుంది. కాని ఈయన మాత్రం వారి శైలీ బిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి ఘన విజయాన్ని అందించి, ఇన్నాళ్ళు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సామాన్యులకు తన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు. 

 

పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కాకుండా వారి తో పాటు ఢిల్లీలో ఉండే ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మెట్రో రైలు డ్రైవర్లు, స్కూల్ ఫ్యూన్లు సహా 50 మంది వీఐపీయేతర వ్యక్తులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక మీద ఉంటారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రముఖ రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాగతం పలికారు. ఇక విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కేజ్రివాల్. దీనిపై సోషల్ మీడియాలో పలువురు ఆయన్ను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: