ఫిబ్రవరి6 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఐటీ దాడులు గురించి తెలుగు ప్రజలకు తెలియనది కాదు. రూ.2వేల కోట్లకుపైగా నల్లధనానికి సంబంధించిన లావాదేవీలు గుర్తించామని ఐటీ అధికారులు లేఖ విడుదల చేశారు. చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌ చౌదరి ఇంట్లో, లోకేష్ బినామీ  కిలారీ రాజేష్‌ కంపెనీల్లో, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కంపెనీల్లో సోదాలు చేసిన అనంతరం ఐటీ అధికారులు లేఖ విడుదల చేశారు. ఫిబ్రవరి 6 నుంచి సోదాలు చేసి..ఫిబ్రవరి 13న ఐటీ అధికారులు లేఖ విడుదల చేశారు. ఐటీ అధికారుల సోదాల్లో బలమైన ఆధారాలు దొరికిన తరువాతనే సంబంధిత శాఖ  లెటర్‌ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి పచ్చ బ్యాచ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

 

చంద్రబాబు కరకట్ట వదిలి హైదరాబాద్ పారిపోయారు. ఓటుకు కోట్లు కేసుతో హైదరాబాద్ వదిలి కరకట్టకు వచ్చిన బాబు, ఐటీ సోదాలతో కరకట్ట వదిలి హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాద్‌లో తన అవినీతి సొమ్ముతో కట్టుకున్న ఇంద్రభవనంలో న్యాయవాదులు,  ఆడిటర్లతో ఐటీ సోదాల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పండి అంటూ చర్చిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ నేత అశోక్ బాబు ఒకరికి ఓ లేఖ  రాశారు.  ఆ లేఖ రాసే అర్హత కూడా అశోక్‌ బాబుకు లేదు. జర్నలిజం విలువలు గురించి నోటితో పలికే కనీస  అర్హత కూడా పచ్చ బ్యాచ్‌కు లేదు. జర్నలిజాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ నాశనం చేసింది ఎల్లో బ్యాచ్‌నే. అటు వంటి ఎల్లో బ్యాచ్‌లో సభ్యుడైన అశోక్ బాబు పత్రికలు విలువల గురించి లేఖ రాయడం హాస్యాస్పదం. 


ఐటీ అధికారులను ప్రశ్నించే ధైర్యం లేదు. కేంద్రాన్ని పోయి అడిగే దైర్యం లేదు. నల్లధనం గురించి మాట్లాడే ధైర్యం అంతకంటే లేదు. 2014 -19 మధ్యలో చంద్రబాబు అప్పులుగా తెచ్చిన రూ.1.95లక్షల కోట్లు ఎక్కడికపోయాయో చెప్పరు. కాని..పత్రికా విలువల గురించి ఎవరికైతే మాట్లాడటానికి అర్హతలేదో వారే మాట్లాడుతున్నారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిందే ఎల్లో గ్యాంగ్. తమకు నచ్చితే వార్త, నచ్చకపోతే అవతలివాడి ఖర్మ అన్నట్లు ఎల్లో పత్రికలు, టీవీలు వార్తలు రాస్తున్నాయి, చూపిస్తున్నాయి. ఫిబ్రవరి13న  ఐటీ అధికారులు లేఖ విడుదల చేసిన తరువాత  చంద్రబాబు అవినీతిని సాక్ష్యాధారాలతో  ఎండగట్టడం మొదలు పెట్టింది. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం గురించి ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతోంది. 


చంద్రబాబు పర్సనల్ సెక్రటరీపై ఐటీ అధికారులు సోదాలు చేసిన తరువాత పచ్చ బ్యాచ్‌కు, పత్రికలకు నిద్రపట్టడం లేదు. చంద్రబాబు హైదరాబాద్‌లోని విలాసవంతమైన కలుగులో దాక్కుంటే..టీడీపీ నేతలు ముందుస్తుగా జాగ్రత్త పడుతున్నారు. డాక్యుమెంట్లు మార్చుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు ఖాళీ చేస్తున్నారు. చిన్నగా విదేశాలకు చెక్కేస్తున్నారు. తప్పు చేస్తేనే కదా భయం. ఎల్లో బ్యాచ్ ,ఎల్లో పత్రికలు ఏం చేసినా సంసారం. సాక్షి వాస్తవాలు రాసి, చూపిస్తే మాత్రం విపరీత అర్ధాలు తీస్తారు. అశోక్‌ బాబు ఓ లేఖ రాశారు. అశోక్‌ బాబు ఆ లేఖ రాశారా?. లేకపోతే ఆ లేఖ ఎవరో రాస్తే ఆయన సంతకం చేశారా?. అనేది పక్కన పెడదాం  . అటువంటి లేఖలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు రాయాలి. వ్యవస్థలను భ్రష్టు పట్టించే చంద్రబాబును కాపాడే బాధ్యత తీసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు టీడీపీ నేతలు ఈ లేఖలు రాయాలి.

 

టీడీపీలో వ్యవస్థలను నమ్మే వాళ్లు,  ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నవాళ్లు తక్షణమే టీడీపీకి రాజీనామా చేసి బయటకు రావాలి. మూడు కంపెనీల్లో ఐటీ సోదాలు జరిగిన మాట వాస్తవం. అశోక్ బాబు లేఖలో ప్రశ్నించింది ఏంటీ?. సోదాలకు సంబంధించి పంచనామా  నివేదికలు తమ దగ్గర ఉన్నాయని అశోక్ బాబు లేఖలో రాశారు. అయ్యా..అశోక్ బాబు మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే చంద్రబాబు పోయి కలుగులో ఎందుకు దాక్కుంటారు?. లాయర్లు, ఆడిటర్లతో మూడ్రోజులుగా చర్చలు జరుపుతూ ఎందుకు కూర్చుంటారు?. మీ టీడీపీ నేతలు మతిబోయి ఎందుకు మాట్లాడుతున్నారు?. అసలు మీరెందుకు లేఖ రాశారు?. ఇవన్నీ కూడా మీ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కాదా?. ఏమయ్యా.. అశోక్ బాబు మీరు గుండె మీద చేయ్యేసుకుని చెప్పండి.

 

.చంద్రబాబు అవినీతి పరుడు కాదా?. అంతర్జాతీయ ఆర్ధిక లావాదేవీలు చంద్రబాబుకే లేవా?. 2019 నుంచి జార్ఖండ్ ఎన్నికల దాకా దాదాపు రూ.22వేల కోట్లు కాంగ్రెస్‌కు చంద్రబాబు ఫండింగ్ చేయలేదా?. చనిపోతున్న కాంగ్రెస్‌కు ప్రాణం పోయడానికి 2019 నుంచి చంద్రబాబు ప్రయత్నించడం లేదా?. అశోక్ బాబు ఇవన్నీ మీకు తెలియదా?. తెలిసి కళ్లు మూసుకుని కూర్చున్నారా? ఎందుకయ్యా ఇంకా ప్రజలను మోసం చేస్తూ..వారి సొమ్మును దోచుకోవడానికి చూస్తారు. మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీ ఆస్తి ఎంత?. ఈ రోజున మీ ఆస్తి ఎంత?. నిజాయితీగా ప్రజలకు చెప్పే ధైర్యం మీకుందా అశోక్ బాబు?.

 

అశోక్ బాబు మీరు బాబు కోసం కాదు బతకాల్సింది ప్రజల కోసం. మీరు లేఖలు రాయాల్సింది బాబును కాపాడటానికి కాదు, అవినీతిని అరికట్టడానికి. మీరు ఉద్యోగాల సంఘం నాయకుడిగా పని చేశారు. ఎంతో మంది సామాన్యులు పనుల కోసం మీ దగ్గరికి వచ్చి ఉంటారు. సామాన్యుల కష్టాలు చూసి ఉంటారు. ప్రజాసేవ చేయడానికి ఎవరికైనా ఓ వేదిక కావాలి. ఆ వేదిక మీరు టీడీపీ అనుకున్నారు. ఎవరిష్టం వారిది. కాని... గంజాయి వనంలో తులసీ మొక్కలా ఉండొచ్చు. మీరు కూడా టీడీపీ వనంలోకి వెళ్లాక గంజాయి మొక్కలా మారిపోయారన్నకధనం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: