మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు ఏపీ బిజెపి నాయకులు. ఇక కేంద్ర బిజెపి నాయకులు కూడా ఏపీలో జగన్ ను ఇబ్బంది పెట్టేలా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నించారు.దీంతో జగన్ పని అయిపోయిందని, ఆయనను జైలుకు పంపే వరకు బిజెపి నిద్రపోదని ఇలా రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అకస్మాత్తుగా జగన్ ను ఢిల్లీకి పిలిచిన బీజేపీ పెద్దలు జగన్ తో అన్ని విషయాలపై చర్చించి, మీరు తీసుకున్న నిర్ణయాలకు మా మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా ఏపీకి అవసరమైన నిధులు కేటాయిస్తామని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా వైసిపిని ఎన్డీఏలో చేరాల్సిందిగా ప్రతిపాదన పెట్టారు. 


త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో వైసీపీకి రెండు మూడు మంత్రి పదవులు కేటాయించే విషయంపైనా చర్చించారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు ఇంత అకస్మాత్తుగా జగన్ అవసరం బీజేపీకి ఎందుకు వచ్చింది అనే డౌట్ చాలామంది లో ఉండిపోయింది. దీనంతటికి ఒకే వ్యక్తి కారణంగా తెలుస్తోంది. ఆయన వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బిజెపి కి ప్రశాంత్ కిషోర్ కు మధ్య రాజకీయం వైరం ఉన్న నేపథ్యంలో జగన్ ను బిజెపి ఎందుకు పిలిచిందా అనే అనుమానం కూడా వస్తోంది.


 ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. బిజెపి జెడియు సన్నిహితంగా ఉండడం పై విభేదించిన ప్రశాంత్ కిషోర్ ను జేడీయూ అహిష్కరించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్నది పీకే ప్లాన్.ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బిజెపి పీకే ట్రాప్ లో జగన్ వెళ్లకుండా ఇలా పొత్తు పేరుతో ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోందని అనే అనుమానాలు బలపడుతున్నాయి. 


ఎందుకంటే ఢిల్లీలో క్రేజివాల్ ప్రభుత్వం ఏర్పడడానికి పీకే సలహాలు కారణం అనేది అందరికి తెలిసిందే. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కూడా కారణం పీకేనే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తన సత్తా చూపించేందుకు పీకే సిద్ధమవుతున్నాడు. ఇలా దేశవ్యాప్తంగా ఆయన ప్రాంతీయ పార్టీలను గెలిపించి తమకు ప్రత్యామ్న్యాయ శక్తిగా మారుతాడనే ఉద్దేశంతో బీజేపీ ముందస్తుగానే జగన్ ను దగ్గర చేసుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: