మాజీ సీఎం చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ నివాసాలపై దాడుల విషయంలో 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడినట్టు సాక్షాత్తూ ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఇప్పుడు ఈ డొంకలు కదిలిస్తే చాలా బాగోతాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం 2 వేల రూపాయల స్కామ్ వెనకాల... ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

 

 

వారిలో లోకేశ్ బాల్య స్నేహితుడు కిలారు రాజేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌తో పాటు కిలారి రాజేష్‌ నివాసాలనూ ఐటీ అధికారులు జల్లెడ పట్టారు. ఇతను ఎవరంటే నారా లోకేష్‌కు బాల్య స్నేహితుడు.. ఆ తరువాత అంచలంచెలుగా బంధం ముదిరి టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగానూ నియమించారు.

 

 

ఈ కిలారి రాజేష్‌కు నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్‌ గ్రూపు సంస్థల్లో పాత్ర ఉందనేది అభియోగం. ఆ తరువాత ఆర్కే ఇన్‌ఫ్రా పేరు కూడా వినిపించింది. ఇది 2014 నుంచి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన కంపెనీ. మరొకటి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబు కంపెనీ. పెద్ద కాంట్రాక్టర్‌ దగ్గర సబ్‌ కాంట్రాక్టు చేస్తున్నట్లుగా సృష్టించి పనిచేయకుండానే బిల్లులు సృష్టించడం.. ఖర్చు అయ్యిందని డబ్బు డ్రా చేసి హవాలా ద్వారా వేరే దేశాలకు తరలించినట్టు అభియోగాలు ఉన్నాయి.

 

 

ఇప్పుడు వీరంతా బాగానే ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక నేరాలను రుజువు చేయడం అంత తేలికైన విషయం కాదు.. ఇప్పటికిప్పుడు వీరికి వచ్చిన ఇబ్బందులు లేకపోయినా.. కోర్టు కేసులు, విచారణ వంటి తలనొప్పులు తప్పవు. కొన్ని కేసుల్లో జైలుపాలు కాక తప్పదు. చూడాలి ఈ కేసులో ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: