టీడీపీ అధినేత చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ నివాసాలపై దాడుల విషయంలో 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడినట్టు సాక్షాత్తూ ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చంద్రబాబు వద్ద పాతికేళ్లు సెక్రటరీగా పని చేశాడు. అయితే ఇప్పడు తెలుగుదేశం నేతలు విచిత్రంగా శ్రీనివాస్ తో దాడులతో టీడీపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తుండటం విశేషం.

 

టీడీపీ వైఖరిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయంపై మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. “ వీళ్లు ప్రతి రోజు నీతి, పద్ధతి, నియమం గురించి లెక్చర్స్‌ ఇస్తుంటారు. వాళ్ల దగ్గర నీతి, పద్ధతి నేర్చుకోవాలంట. పీఎస్‌ మీద ఐటీ రైడ్స్‌ జరిగితే మాకేం సంబంధం అని మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలుగా టీడీపీ ముఖ్య అనుచరుడిగా ఉన్న వ్యక్తిపై సోదాలు జరిగితే సంబంధం లేదంటున్నారు. ప్రత్యర్థి పార్టీకి సంబంధం ఉంటుందా..? అంటూ నిలదీశారు.

 

" యనమల ఇంగ్లిష్‌ ప్రెస్‌ రిలీజ్‌ మాకు అర్థం కావడం లేదని మాట్లాడుతున్నారు. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌లో ఏముందో యనమల మీడియాకు వివరించాలి. ఇంత జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్‌ నాయుడు ఎందుకు మాట్లాడడం లేదు. రూ.2 వేల కోట్ల పైగా దొంగబిల్లులు, హవాలా జరిగిందో.. పేరుగాంచిన వ్యక్తికి పర్సనల్‌ సెక్రటరీ దీంట్లో ప్రధాన వ్యక్తి అని తేల్చిందని బుగ్గన గుర్తు చేశారు.

 

ఈ కేసులో ఎవరు మెయిన్‌ పర్సన్‌ అంటే పెండ్యాల శ్రీనివాస్‌.. ఇతను 1995 నుంచి 2004 వరకు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీనివాస్‌ అప్పటి సీఎం కార్యాలయంలో పనిచేశారు. 2004లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. శ్రీనివాస్‌ పీఏగా చేరాడు. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబుకు పీఎస్‌గా మారాడు. 25 సంవత్సరాలుగా పెండ్యాల శ్రీనివాస్‌.. చంద్రబాబు దగ్గర ఉంటున్నాడు. 25 సంవత్సరాలుగా చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్‌పై ఐటీ సోదాలు జరిగితే తమకేం సంబంధం అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: