వైసీపీ పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. శాసన మండలి ఆల్మోస్ట్ ఆల్ రద్దు అయ్యే అవకాశం ఉండటంతో ఇద్దరి మంత్రి పదవులు పోతున్నాయి. దీంతో వాటి స్థానంలో జగన్ ఎవరు కేబినెట్లోకి తీసుకుంటారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. శాసన మండలి రద్దు తో పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరు తమ మంత్రి పదవులను కోల్పోతున్నారు. రెవిన్యూ శాఖలో subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయక ముందు పర్యవేక్షించేవారు. మోపిదేవి వెంకటరమణ పశుసంవర్ధక శాఖలో అంతేకాకుండా వెనుకబడిన వర్గాల శాఖ పర్యవేక్షించడం జరిగింది. దీంతో తాజాగా వీళ్లిద్దరు మంత్రిపదవులు కోల్పోతున్న తరుణంలో వారి స్థానంలో జగన్ ఎవరిని తీసుకుంటారన్న ప్రధాన చర్చ పార్టీల్లో నెలకొంది.

 

ఇదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం వారు పూర్తి అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం లేదని జగన్ పై విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఒకవేళ ఇవ్వాలనుకుంటే...ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఇలా చాలామంది పేర్లు వినపడుతున్నాయి. కానీ జగన్ మాత్రం ఏ వ్యక్తులు అయితే మంత్రి పదవులు కోల్పోతున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన వర్గానికి చెందిన వారిని మంత్రి పదవి లోకి తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట.

 

ఇటువంటి నిర్ణయం తో ఏ ఒక్కరిని నొప్పించకుండా పార్టీలో గొడవలు రాకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్లేసులో అదే సామాజిక వర్గానికి చెందిన  తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరు వినపడుతుంది. మరోపక్క subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లేసులో అదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ పేరు జగన్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో జగన్ సరికొత్త ఈక్వేషన్ అదిరిపోయింది...మంత్రి పదవుల విషయంలో ఏ ఒక్కరు కూడా ఆశావహులు ఉండరని పార్టీలోనే టాక్ గట్టిగా వినబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: