ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలపై కుల ప్రభావం చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రాలో ఈ కుల ప్రభావం చాలా ఎక్కువ. అందులోనూ కమ్మ, రెడ్డి కులాల మధ్య రాజకీయంగా ఆధిపత్యపోరు ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఈ కులాల ఆధిపత్యం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

 

ఆంధ్రా రాజకీయాల్లో కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యాలను ఆయన లెక్కలతో సహా వివరించారు. వాస్తవానికి రెడ్డి, కమ్మ ఈ రెండు కూడా జనాభాపరంగా అంత పెద్ద కులాలు కావు. కానీ స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థుల్లో నూటికి 50 శాతం పైగా ఈ రెండు కులాల నుంచే వచ్చారని అరుణ్ కుమార్ తెలిపారు. ఈ రెండు కులాల్లో 27 శాతం ఓ కులం, 22 శాతం మరో కులం నుంచి అసెంబ్లీలో గెలిచారట.

 

ఆంధ్రప్రదేశ్ లోని ఈ కుల సమీకరణాలు- ఎన్నికలు, రాజకీయాలు అనే అంశాలను జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఓ పుస్తకంలో గణాంకాలతో సహా వివరించారని అరుణ్ కుమార్ తెలిపారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకం తప్పక చదవాలని సూచించారు. అంతే కాదు.. ఇక కమ్మ కులం ఆధిపత్యం, అభివృద్ధి గురించి ప్రత్యేక పరిశోధనలు కూడా జరిగాయట.

 

కమ్మ కులం ఎందుకు అంతగా బాగుపడింది అన్న విషయంపై తెలుగు వారే కాకుండా.. ఇతర దేశాల వారు కూడా పరిశోధనలు చేసి విశ్వవిద్యాలయాల్లో ధీసెస్ సమర్పించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఎవరి కులంపై వారికి అభిమానం ఉండటంలో ఎలాంటి తప్పులేదని ఉండవల్లి అన్నారు. అయితే డబ్బు ఉన్న కులమే బాగుపడాలన్న ఫీలింగ్ వస్తే పేద కులాలు ఇబ్బంది పడతాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: