అవసరమైతే ఎన్డిఎలో చేరతాం అంటూ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయాయి. దాదాపు అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు రావడంతో ప్రభుత్వం నష్ట నివారణా చర్యలకు దిగింది. అసలు తాము ఎన్డిఎలో చేరడం లేదని అలాంటిది ఏదైనా ఉండి ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రకటన వస్తుంది అంటూ పలువురు మంత్రులు స్పష్టం చేసారు. 

 

రాజకీయంగా ఎన్డిఎలో చేరడం అనేది ఆత్మహత్య చేసుకున్నట్టే అంటూ పలువురు కార్యకర్తలు కూడా వాపోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో ఈ పరిణామం పార్టీనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందీ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు. అసలు తాను అలాంటి మాటలు ఏమీ అనలేదు అన్నారు ఆయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ అవసరం వస్తే ఎన్డిఎలో చేరే విషయాన్ని ఆలోచిస్తారు గాని ప్రస్తుతానికి ఆ అవసర౦ తమకు లేదని అన్నారు బొత్సా. 

 

అయితే దీని వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే జగన్ బోత్సాతో మాట్లాడినట్టు సమాచారం. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వంలో సీనియర్ గా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ బొత్సా సత్యనారాయణ మీద జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తర్వాత వైసీపీ, బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు కూడా ఎన్డిఎలో చేరే అంశాన్ని తప్పుబట్టారు. దీనితో చాలా మందికి ఎం జరుగుతుంది అనేది అర్ధం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: