వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని బ్యాంకులకు పంగనామాలు పెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా కాళ్ళ బేరానికి వచ్చారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం విజయ్ మాల్యా యుకెలో ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని అప్పగించాలి అంటూ మోడీ సర్కార్ కొంత కాలంగా ఆ దేశాన్ని కోరుతూనే ఉంది. అయితే తాను మాత్రం దర్జాగా తిరుగుతూ వడ్డీలు కట్టలేను గాని, అసలు కడతాను అంటూ ప్రకటించాడు. అయినా మోడీ సర్కార్ గాని బ్యాంకులు గాని అతని మాట వినే పరిస్థితి కనపడటం లేదు. 

 

ఈ నేపధ్యంలో విజయ్ మాల్యా కాళ్ళ బేరానికి వచ్చినట్టు కనపడుతుంది. తాజాగా ఈ లిక్కర్ కింగ్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఇచ్చిన అసలులో వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని మన దేశ బ్యాంకులకు ఆయన విజ్ఞప్తి చేసాడు. తాను రెండు చేతులు జోడించి అడుగుతున్నానని... తనకు బ్యాంకులు ఇచ్చిన అసలులో వంద శాతాన్ని వెంటనే వెనక్కి తీసుకోండని విన్న వించుకున్నాడు. తానును తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోన్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆస్తులను జప్తు చేసిందని వాపోయాడు.

 

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద తాను ఏ విధమైన నేరం చేయలేదని విజయ్ మాల్యా స్పష్టం చేసాడు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాత్రం సుమోటోగా తన ఆస్తులను జప్తు చేసిందని వాపోయాడు. బ్యాంకులు దయచేసి మీ సొమ్మును తీసుకోండని కోరాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయని విజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. తనకు ఇచ్చిన అప్పును మొత్తం చెల్లిస్తానని, కానీ వడ్డీ మాత్రం చెల్లించలేనని విజయ్ స్పష్టం చేసాడు. తనపై అందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టారని వాపోయాడు. 17 బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా దాదాపు 9 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: