ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ లేఖ రాసారు. కరోనా వైరస్ తో గత రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్న చైనా దేశం లోని వూహాన్‌ నగరం లో ఉన్న అన్నెం జ్యోతి, టి.సత్యసాయి కృష్ణను స్వదేశానికి తీసుకురావాలని జై శంకర్‌ కు ఇటీవల చంద్రబాబు ఒక లేఖ రాసి విజ్ఞప్తి చేసారు. దీనికి జై శంకర్ స్పందించారు. వారిని తీసుకురావడం పై తాము కృషి చేస్తున్నట్టు జై శంకర్ ఆ లేఖలో వివరించారు. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకుంటున్నామని అన్నారు. 

 

కేంద్ర ప్రభుత్వం, బీజింగ్‌ లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని జై శంకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారన్న ఆయన... జ్యోతి, సాయికృష్ణ, కుటుంబ సభ్యులు, వూహాన్‌ లో ఉన్న వైద్యుల తో ఎంబసీ అధికారులు టచ్‌ లో ఉన్నారని ఆ లేఖలో ఆయన వివరించారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించామని ఆయన చెప్పారు. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటామని ఆయన ఆన్నారు. 

 

కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్టు అంతర్జాతీయ మీడియా చెప్తుంది. అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని, కొన్ని నగరాల్లో మినహా దాదాపు అన్ని నగరాల్లో కరోనా తగ్గుముఖం పట్టినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ దెబ్బకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 70 వేల మంది వరకు కరోనా బారిన పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని చైనా ప్రభుత్వం కూడా ఆశాభావ౦ వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: