మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో... ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చీపురు పార్టీ మరోసారి సత్తా చాటిన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న బిజెపి పార్టీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కసరత్తులు చేసి మరెన్నో కలలుగన్నప్పటికీ మరోసారి బిజెపి కల కలగానే మిగిలిపోయింది. మరోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాట లేకపోయింది బిజెపి పార్టీ. ఇక 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా కేజ్రీవాల్ ఆప్  పార్టీ 62 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది బిజెపి 8 స్థానాల్లో గెలిచింది. 

 

 

 కాగా  మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ నేడు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారోత్సవం వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం వేడుకకు ఎంతో మంది వీఐపీలు విచ్చేస్తారు దీంతో ఎంతో హడావిడి ఉంటుంది. కానీ మూడోసారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అందరికంటే భిన్నంగా ఆలోచించి ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. అత్యంత సామాన్యులైన 50 మంది కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి వీఐపీలు గా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత మనీష్ సిసోడియా వెల్లడించారు. 

 

 

 కాగా  ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న వాళ్ళు ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఆటో ఆంబులెన్స్ డ్రైవర్లు  పాఠశాల ఫూన్లు,  మొహాల్ల క్లినిక్ వైద్యులు బస్సు మార్షల్స్ సింగపూర్ బ్రిడ్జి ఆర్కిటెక్ట్, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలు ఉన్నట్లు మనీష్ సిసోడియా వెల్లడించారు. దీంతో ఈరోజు 10 గంటలకు జరగబోయే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కాగా  ఈ ప్రమాణ స్వీకారం ఢిల్లీలోని భన్సాలీ  మైదానంలో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: