సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. అదే సమయంలో సెలబ్రిటీలు కూడా తమ సినిమాలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు కానీ కొంతమంది మాత్రమే తమ పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ అయితే ఎక్కువగా తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే సెలబ్రిటీ అయినంత మాత్రాన వారి వ్యక్తిగత విషయాల గురించి బయటకు రావాల్సిన అవసరం లేదు కదా. కానీ ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లైఫ్ లో ఆనందమే కాదు ఎంతో బాధ కూడా ఉంది అంటూ ఆ స్టార్ హీరోయిన్ చెబుతోంది. 

 

 

 ఇంతకీ తన లైఫ్లో నీ పర్సనల్ విషయాలను పంచుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా... ఎన్నో ఏళ్ల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  టాప్ హీరోయిన్ గా కొనసాగి ఆ తర్వాత స్టార్ హీరో అజయ్ దేవగన్ తో  ప్రేమలో మునిగితేలీ  ఆ తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజోల్. తాజాగా ఆమె గర్భస్రావం గురించి చెప్పి తల్లడిల్లిపోయింది. అంతేకాకుండా తన జీవితంలోని కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది. అజయ్ దేవగన్ తో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన కాజోల్ ... ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు కాజల్. 

 

 హనీమూన్  తర్వాత కొన్నాళ్లకు పిల్లలు కావాలని అనుకున్నామని కానీ తొలిసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని రోజులకు గర్భస్రావం అయింది అంటూ కాజోల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 2001లో కబీ ఖుషి కబీ ఘమ్  అనే సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భం దాల్చనని  కానీ అదే సమయంలో గర్భస్రావం కావడంతో ఆస్పత్రిలో చేరాను అంటూ గుర్తు చేసుకున్నారు . ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే గర్భస్రావం అయ్యింది అంటూ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకొన్నారు  కాజొల్. ఇక రెండు సార్లు అలా కావడంతో బెస్ట్ డాక్టర్ తో ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ కపుల్ లో ఎంతోమంది ఫేవరెట్ కపుల్ గా ఉన్న కాజల్ అజయ్ దేవగన్ దంపతులకు  ఇద్దరు పిల్లలు.

మరింత సమాచారం తెలుసుకోండి: