భారతదేశంలో నెంబర్వన్ సంపన్నుడు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ సంస్థ అధినేత అయిన ముఖేష్ అంబానీ ప్రతి సంవత్సరం భారతదేశంలో సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం సంపదను మరింతగా పెంచుకుంటూ ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థలను మరింత అభివృద్ధి చేసుకుంటూ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక దేశ సంపన్నుల్లో మొదటి స్థానంలో ఉండే ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ని స్థాపించిన తర్వాత ముఖేష్ అంబానీ సంపద  మరింతగా పెరుగుతూ వస్తోంది. మొన్నటికి మొన్న టాప్ టెన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు ముఖేష్ అంబానీ. ప్రస్తుతం ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ జియో లాభాల బాటలో దూసుకుపోతుండటంతో  ముఖేష్ అంబానీ సంపద రెట్టింపవుతూ  వస్తుంది. 

 

 

 అయితే దేశంలోని ప్రతి ఒక్కరికీ దేశంలోని సంపన్నులు మొదటి స్థానంలో ఉన్నది ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. మరి ముఖేష్ అంబానీ తర్వాత దేశ సంపన్నులు జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది ఎవరు అంటే. చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా పలువురి పేర్లు మైండ్ లోకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో ఉంది ఎవరు తేలిపోయింది. కాగా ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు రాధాకృష్ణన్ ధమని. ఎవెన్యూ సూపర్ మార్ట్స్  వ్యవస్థాపకుడు డి మార్ట్ ప్రమోటర్ అయినా రాధాకృష్ణన్ ధమని ప్రపంచ సంపన్నుల జాబితాలో తాజాగా రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. 

 

 

 కాగా రాధాకృష్ణ దమాని  తర్వాత.. టాప్ సిక్స్ లో శివ్ నాడార్  హెచ్సిఎల్.. ఉదయ్ కోటక్, గౌతమ్ ఆదాని, లక్ష్మీ మిట్టల్ చోటు సంపాదించారు.కాగా  దేశ సంపన్నుల జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నా ఎవెన్యూ సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు డి మార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణన్  ధమని కుటుంబ సంపద 1708 కోట్ల  డాలర్లుగా ఉందని ఫోర్స్ రియల్ టైం బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: