జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అమరావతిలోని పలు గ్రామాలలో పర్యటించి అమరావతి రైతులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే అంశమే అని కానీ రాజధానికి సంబంధించిన నిర్ణయం గత ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయిందని అన్నారు. రైతులతో కొంత సమయం ముచ్చటించిన పవన్ కళ్యాణ్ అమరావతి నుండి రాజధాని ఎక్కడికీ మారదని ఒకవేళ ప్రభుత్వం రాజధానిని మార్చినా అది తాత్కాలికమేనని అన్నారు. 
 
రైతుల కొరకు బీజేపీ పార్టీతో కలిసి పోరాటం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్నాయని ఆ వార్తలు నిజం కాదని పవన్ చెప్పారు. బీజేపీ వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేయదని అన్నారు. వైసీపీ పార్టీ నేతలు బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణలు చేశారు. 
 
ప్రజల కోసం మాత్రమే తాను రాజకీయాలలోకి వచ్చానని తాను అధికారంలో లేనని పవన్ అన్నారు. జనసేన పార్టీ నుండి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారని ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా తమతో ఉన్నారో లేదో తెలియదని పవన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుండి వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు. 
 
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను జనసేన పార్టీ వ్యతిరేకించిన సమయంలో కూడా రాపాక జగన్ కే మద్దతు ఇచ్చారు. అదే సమయంలో జనసేన పార్టీ కార్యక్రమాలకు రాపాక హాజరు కాకపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ఘాటుగా విమర్శించారు. జనసేన పార్టీ తరపున గెలిచినప్పటికీ పార్టీ నిర్ణయాలకు, పవన్ నిర్ణయాలను వ్యతిరేకంగా రాపాక వ్యవహరిస్తూ ఉండటంతో పవన్ రాపాక తమతో ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: