తెలంగాణ రాష్ట్ర సమితి లో అసమ్మతి సెగలు ఉన్నాయన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో కూడా చోటు దక్కని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అసంతృప్తి లో ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి పదవి మీద ఆశతో టీఆర్‌ఎస్‌ లో చేరిన నాయకులు పదవి దక్కకపోవటం పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అధినేత తీరుపై అసంతృప్త జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 

కేసీఆర్‌ కు సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు టీఆర్‌ఎస్‌ పై బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగరేశారు. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన వర్గం రెబల్స్‌ గా బరిలో దిగారు. గత ఎన్నికల్లో గెలిస్తే తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించాడు మైనంపల్లి హనుమంతరావు. అయితే ఎన్నికల్లో గెలిచిన రెండు విస్తరణ లోనూ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో మైనంపల్లి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అందుకే మెట్రో రైళు ప్రారంభోత్స కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది.


మంత్రి వర్గ విస్తరణలో హరీష్‌ రావుకు చోటు కల్పించినా ఆయన వర్గం ఇచ్చిన మంత్రి పదవి పై సంతృప్తిగా లేరన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న వార్తలు కూడా హరీష్‌ వర్గంలో తీవ్ర అసంతృప్తి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేటీఆర్‌ సొంత మనిషిగా పేరు పడ్డ యువ బాల్కా సుమన్‌ కు త్వరలో మంత్రి పదవి దక్కుతుందన్న వార్తలు టీఆర్ఎస్ వర్గాల్లో మాట్ టాపిక్‌ గా మారాయి. ఉద్యమకాలం నుంచి కేటీఆర్‌ కు సన్నిహితుడిగా పేరున్న సుమన్‌ కు మంత్రి పదవి ఖాయం అయితే మరింత మంది అసంతృప్తులు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: