మనిషి జీవితం నిరంతర పోరాటం.. ఆలోచనలతో చేసే యుద్ధం కంటికి కంపించని శత్రువుతో సమానం.. అందుకే కలతల కొలిమిలో కరిగిపోకు. కాటేసే విధికి లోంగిపోకు. కరిగిపోయే కాలంతోనే కదా నీ పయనం. పయనం అంటే జీవనం.  జీవనం అంటే మధురం.. మధురం అంటే అనుభవం.. ఆ అనుభవమే కోటిమంది జీవితాల్లో వెలిగే దీపం.. అవును ఈ అక్షరాలు అక్షర సత్యాలు.. ఎందుకంటే కష్టాలు అందరిని తరుముతాయి. కాని కొందరు మాత్రమే యోధుడిలా వాటికి ఎదురుగా నిలబడి పోరాడుతాడు..

 


ఒక ఇంటిలో మొదలైన సమస్య ఆ ఇంటితో ఆగిపోలేదు. ఒక మనిషిలో వచ్చిన మార్పు ఆ ఇంటి గడపలోనే దాగిపోలేదు.. ఆ మనిషికి వచ్చిన ఆలోచన నాలుగు గోడలకే పరిమితం కాలేదు. అవును ఇదంతా నిజమని చెప్పడానికి సందేహం లేదు. ఎందరో తనలాగా బాధపడకూడదని వేసిన ఆ అడుగే నేడు ‘పినాకిల్‌ బ్లూమ్స్‌ సంస్థ’లా అంకురించింది. తమలా ఏ తల్లిదండ్రులూ బాధపడకూడదనే తలంపుతో ఆటిజం బారిన పడిన చిన్నారులకు ఉచితంగా సేవలందించడమే ఈ సంస్ద ముఖ్య ఉద్దేశ్యం..

 

 

ఇక సమాజంలో ఉన్న మానసిక ఎదుగుదల లేని బుద్దిమాంద్యం ఉన్న పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' చేసే పని అదే. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికి తీయడానికి, వారి కుటుంసభ్యులను, పాఠశాలలను కూడా భాగస్వాములను చేస్తున్నది. అందుకోసం సృజనాత్మక శిక్షణా కోర్సులను రూపొందించారు శ్రీ కోటిరెడ్ది గారి సతీమని శ్రీజారెడ్డి.  ఇలాంటి నిర్ణయం వెనక దాగి ఉన్న నిజం శ్రీజారెడ్డి కొడుకు సంహిత్‌..


 

అవును సంహిత్‌కు ఏడాదిన్నర దాటిన తర్వాత ‘ఆటిజం’ ఉన్నదని తెలిసింది. అప్పటివరకు వారికి ‘ఆటిజం’ అంటే ఏమిటో తెలియదు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి శ్రీజ, కోటిరెడ్డిలు అన్వేషణ మొదలుపెట్టారు. ఆ సమయంలో ‘ఆటిజం’ గురించిన 400 పేజీల పుస్తకం వారికి లభించింది. ఆ సమస్య గురించి చదువుతున్న కొద్దీ ఇద్దరికీ దుఃఖం ఆగలేదు. ఎంతో బాధపడ్డారు. ‘ఆటిజం’ ఎందుకు వస్తుందో తెలుసు కోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ముప్పై ఏండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారి పరిశోధనలు ఫలితాన్నివ్వలేదు. 1995లో 500 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. 2019 నుంచి 32 మంది పిల్లల్లో ఒకరు ‘ఆటిజం’ బారిన పడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న శ్రీజ, కోటిరెడ్డిలు ఎంతో చలించిపోయారు.

 

 

అప్పటి నుండి ఈ సమస్య మీద పోరాటం చేస్తూ, పరిష్కారం కోసం అన్వేషించడం మొదలు పెట్టారు.ఇందుకు గాను ఇప్పటివరకు సుమారుగా రూ. 4కోట్లు ఖర్చు చేశారు. ఇలా మూడేండ్ల రీసెర్చ్‌ తరువాత ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' పేరుతో సుచిత్రలో మొదటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బోయినపల్లి, హైదరాబాద్‌లలో వేర్వేరు చోట్ల ఇలాంటి సంస్దలు ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 14 కేంద్రాలు నెలకొల్పారు.. ఇక రోజు రోజుకు ఈ సమస్య బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ సంస్ద ఏందరో పిల్లలకు సేవలు అందించడానికి సిద్దం అవుతుంది..

 

 

ఇక ఈ ఆటిజం బారిన పడిన వారు ఒక మన రాష్ట్రం నుండే కాకుండా, తమిళనాడు, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, వంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. విశేషమేమిటంటే అమెరికా, లండన్‌, కువైట్‌, ఖతార్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలవారు కూడా ‘పినాకిల్‌ బ్లూమ్స్‌' సేవలు అందుకోవడం విశేషం.. ఇక తమ కుమారుడి విషయంలో బాధపడుతూ కూర్చుంటే బరువు దిగదని భావించిన ఈ జంట, నలుగురి బరువును తగ్గిస్తూ ఎందరికో ఆదర్శంగా జీవిస్తున్నారు..








 

మరింత సమాచారం తెలుసుకోండి: